
భువనగిరిటౌన్ : దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని, కాపాడే దిశగా ప్రజలంతా కదలాలని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ పిలుపు మేరకు భువనగిరిలోని బాబు జగ్జీవన్‌రాం విగ్రహం ఎదుట సోమవారం సత్యాగ్రహ సంకల్ప దీక్ష చేపట్టారు. దీక్షలో ఆయన పా ల్గొని మాట్లాడుతూ.. మోదీ సర్కార్ దేశ సంపదను ఆదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా బీజేపీలో భయాందోళన సృష్టించారని, తట్టుకోలేక మోదీ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సీబీఐ, ఈడీ వంటి రాజ్యాంగ సంస్థలను తన రాజకీయ లబ్ధికోసం ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీకి ప్రజలే సరైన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ విడుతల వారీగా చేపట్టే నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. దీక్షలో మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, జెడ్పీ ఫ్లోర్ లీడర్ కుడుదుల నగేష్, ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీర్ల అయిలయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోదర్‌కుమార్, పీసీసీ సభ్యుడు తంగెళ్లపల్లి రవి కుమార్, కోట పెద్దస్వామి, బిస్కుంట సత్యనారాయణ, గుర్రాల శ్రీనివాస్,చల్లగురుగుల రఘుబాబు, బర్రె జహంగీర్, ఈరపాక నరసింహ, లాల్ రాజ్, పాశం శివానంద్ తదితరులు పాల్గొన్నారు.
ఫ బీజేపీకి గుణపాఠం తప్పదు
ఫ సత్యాగ్రహ సంకల్ప దీక్షలో
డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి