
స్పటిక లింగానికి హారతినిస్తున్న పూజారి
భువనగిరి : సైన్స్ అండ్ టెక్నాలజీలో ధోరణులు, దేశ భవిష్యత్ గురించి పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇస్రో యువికా–2023 నిర్వహించనుందని డీఈఓ నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023 జనవరి 1నాటికి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులన్నారు. www.irso.gov.in/YU VIKA.html అనే లింక్ ద్వారా విద్యార్థులు నాలుగు దశలు పూర్తి చేసి, అవసరమైన సర్టిఫికెట్‌లు అప్‌లోడ్ చేసి క్విజ్ పరీక్ష రాయాలని సూచించారు. ఏప్రిల్ 3వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మే 15 నుంచి 26వ తేదీ వరకు యువికా –2023 పోగ్రాం జరుగుతుందన్నారు. వివరాల కోసం జిల్లా సైన్స్ అధికారి భరణికుమార్ సెల్ నంబర్ 9000989726ను సంప్రదించాలని కోరారు.
మహా శివుడికివిశేష పూజలు
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం విశేష పూజలు చేపట్టారు.స్వామి వారికి నిత్య కై ంకర్యాలు, మండపంలో నిత్య రుద్ర హవనం, అభిషేకం, అర్చనలు నిర్వహించారు. అనంతరం గర్భాలయం ము ఖ మండపంలోని స్పటిక లింగానికి పూజలు చేసి హారతినిచ్చారు. ఇక వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీసీతారామచంద్రస్వామికి పూజలు నిర్వహించారు. యాదాద్రి ప్రధానాలయంలో నిత్య పూజలు గావించారు.
ఉప ప్రధానార్చకుడిగా భాస్కరాచార్యులు
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉప ప్రధానార్చకుడిగా పి. భాస్కరాచార్యులు నియమిస్తూ ఈఓ గీతారెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంఽధించిన నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు. 2001లో పరిచారకుడిగా యాదా ద్రి ఆలయంలో భాస్కరాచార్యులు విధుల్లో చేరారు. ఆ తర్వాత అర్చకుడిగా కొనసాగుతూ ఏడేళ్ల క్రితం ఆలయ ముఖ్య అర్చకుడిగా నియమితులయ్యారు. ఉప ప్రధానార్చకుడిగా ఉన్న కాండూరి వెంకటచార్యులు ఇటీవల ప్రధానార్చకుడిగా నియమితులయ్యారు. ఆ పోస్టులో భాస్కరాచార్యులను నియమించారు.
రైల్వే స్టేషన్‌ను
సందర్శించిన ‘గూడూరు’
భువనగిరి : భువనగిరి రైల్వే స్టేషన్‌ను సోమవారం బీజేపీ రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి సందర్శించారు. సమస్యలు తెలుసుకున్నారు. కాకతీయ ఎక్స్‌ప్రెస్ వేళలను మార్చడంతో ఉదయం హైదరాబాద్ వెళ్లే వివి ధ వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రయాణికులు ఆయన దృష్టికి తెచ్చారు. తిరుగు ప్రయాణంలో ఇంటికి చేరుకునేసరికి రాత్రి 11 అవుతుందన్నారు. త్వరలోనే రైల్వే శాఖ మంత్రిని కలిసి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ఆయన వెంట పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు ఉమాశంకర్‌రావు ఉన్నారు.

ప్రయాణికులతో మాట్లాడుతున్న గూడూరు నారాయణరెడ్డి

భాస్కరాచార్యులకు నియామకపత్రం అందజేస్తున్న ఈఓ గీతారెడ్డి