
జ్యోతిర్లింగం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
చౌటుప్పల్: ప్రతిఒక్కరూ ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శ్రీసోమనాథ క్షేత్రం ఆధ్వర్యంలో చేపట్టిన జ్యోతిర్లింగం నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దైవ కార్యక్రమాల కోసం కొంత సమయం వెచ్చించాలని తెలిపారు. సోమనాథ క్షేత్రానికి అవసరమైన మేరకు సహకారాన్ని అందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పోలోజు శ్రీధర్‌భాబు, సందగళ్ల విజయ, అధ్యక్షుడు బడుగు నర్సింహ, ఉపాధ్యక్షుడు సుభాష్, కార్యదర్శి గట్టు ప్రభాకర్, సీహెచ్.రవీందర్, అప్పిడి రాంరెడ్డి, కొమిరెళ్లి శంకర్‌రెడ్డి, బడుగు సావిత్రమ్మ, బీజేపీ నాయకలు బడుగు మాణిక్యం, మొగుదాల రమేష్‌గౌడ్, సందగళ్ల సతీష్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి