
మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు, పాల్గొన్న వెన్‌రెడ్డి రాజు
చౌటుప్పల్: పట్టణ కేంద్రంలోని చిన్నకొండూర్ రోడ్డులో ఉన్న దొరవారి ఇంటి ఎదుట ఆక్రమణకు గురైన కచ్చీర్ స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఎం మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహ, జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ పాష మాట్లాడుతూ ఇటీవల కొంతమంది అక్రమార్కులు తప్పుడు పత్రాలతో కచ్చీర్ స్థలాన్ని కబ్జా చేసి ప్లాట్లుగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అధికార యంత్రాంగం స్పందించి కచ్చీర్ స్థలాన్ని కాపాడాలని కోరారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాకు మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, సీపీఎం నాయకులు దండ అరుణ్‌కుమార్, బత్తుల లక్ష్మయ్య, బొడ్డు అంజిరెడ్డి, చింతకింది పాండు, పాశం రామరాజు, బత్తుల దాసు, దేప రాజు, తొర్పునూరి మల్లేషం, లక్ష్మయ్య, నర్సింహ, ధర్మయ్య, శ్రీను, రమేష్ పాల్గొన్నారు.