
నిరసన తెలుపుతున్న నాయకులు
యాదగిరిగుట్ట రూరల్: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు సూదగాని హరిశంకర్ గౌడ్ అన్నారు. యాదగిరిగుట్ట మండలంలోని మహబూబ్‌పేట గ్రామంలో ఈదురు గాలులతో పశువుల పాక కూలిపోయిన రైతు ఆరె జంగయ్య వ్యవసాయ పొలాన్ని సోమవారం పరిశీలించారు. రైతు కుటుంబానికి రూ.5వేల ఆర్థికసాయం అందజేశారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర నాయకులు వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్, పడాల శ్రీనివాస్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుంటిపల్లి సత్యం, జిల్లా కోశాధికారి అచ్చయ్య, మండల అధ్యక్షుడు కళ్లెం శ్రీనివాస్ గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, పుల్లె నరేష్, చంద్రమౌళి, శ్రీధర్ రెడ్డి, పాండురంగా రెడ్డి ఉన్నారు.
కలెక్టరేట్ ఎదుట నిరసన
భువనగిరిటౌన్: అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు పైళ్ల యాదిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కొల్లూరు రాజయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు దయాకర్, కొమరయ్య, అంజయ్య, ఏశాల అశోక్, సబిత, లక్ష్మీపతి ఉన్నారు.
పంట రుణాలు చెల్లించాలి
అడ్డగూడూరు: రైతులు పంట రుణాలు సకాలంలో చెల్లించి రెన్యూవల్ చేసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం అడ్డగూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో డైరెక్టర్లు బైరెడ్డి అశోక్‌రెడ్డి, మానుపాటి భిక్షం, పోగుల నర్సిరెడ్డి, వేముల భిక్షం, అంబటి జోస్సనమ్మ, కడారి శ్రీశైలం, కొప్పుల నిరంజన్‌రెడ్డి, వీరస్వామి, సీఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మహబూబ్‌పేట గ్రామంలో వ్యవసాయ బావిని పరిశీలిస్తున్న సూదగాని హరిశంకర్ గౌడ్