
వలిగొండ: ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి
బీబీనగర్: ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతున్న బీఆర్‌ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం బీబీనగర్ మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల పట్ల బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తిరగుబాటు మొదలవుతున్నందున మోదీ ఆందోళన చెందుతున్నారన్నారు. అంతకుముందు మండల కేంద్రంలో నూతన పీహెచ్‌సీ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు, కార్యక్రమంలో జెడ్పీచైర్మన్ సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎంపీపీ సుధాకర్‌గౌడ్, జెడ్పీటీసీ ప్రణీతాపింగళరెడ్డి, సర్పంచ్ భాగ్యలక్ష్మి, రైతు సమితి మండల కోఆర్డినేటర్ జైపాల్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజారోగ్యమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం
వలిగొండ: పేద ప్రజల ఆరోగ్యమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం వలిగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆవరణలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.కోటి 56 లక్షలతో చేపట్టిన నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. మండల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీసీపీ రాజేశ్ చంద్ర, జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్‌రావు, జిల్లా అదనపు వైద్యాధికారి యశోధ, డాక్టర్ సుమన్ కళ్యాణ్, పంచాయతీ రాజ్ అధికారులు వెంకటేశ్వర్లు, గిరిధర్, ఎంపీపీ నూతి రమేష్, సర్పంచ్ బొల్ల లలితా శ్రీనివాస్, ఎంపీటీసీలు పలుసం రమేష్, కుందారపు యశోధ కొమురయ్య, పల్లెర్ల భాగ్యమ్మ రాజు, నాయకులు పాల్గొన్నారు.
మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

బీబీనగర్: ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి