
దీక్ష చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
రామన్నపేట: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం రామన్నపేటలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు సాల్వేరు అశోక్, ఎండీ జమీరోద్దిన్ మాట్లాడుతూ రాహుల్‌గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేక బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. మోదీ అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. కార్యక్రమంలో మహ్మద్ ఎజాజ్, గురుకు శివ, మోటె స్వామి, మహ్మద్ మహబూబ్‌అలీ, బట్టె సంతోష్, సంగిశెట్టి బాబు, మహేశ్వరం అశోక్, మేడి శంకరయ్య, మహ్మద్ ఇంతియాజ్, బట్టె కృష్ణమూర్తి, నోముల లింగస్వామి, ఐలాపురం సోమయ్య, మాండ్ర సత్తి, నకిరేకంటి భిక్షం, గాదె నర్సింహ, ఎల్లయ్య, సురేష్, సలీం, రాములు, నర్సింహ పాల్గొన్నారు.