
సంతకాల సేకరణ పత్రాలు అందజేస్తున్న నాయకులు
భువనగిరిటౌన్: అర్బన్‌కాలనీకి వెళ్లే రైల్వే గేట్ సమస్యను పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏశాల అశోక్ డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ పత్రాలను అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారు. వారిలో మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సోమన సబిత తదితరులు ఉన్నారు.
31న ఆత్మీయ సమ్మేళనం
మోత్కూరు: మోత్కూరు మండల కేంద్రంలో ఈ నెల 31న జరిగే బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పొన్నబోయిన రమేష్ కోరారు. సోమవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ యాకూబ్‌రెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మణాచారి, వైస్ ఎంపీపీ బుషిపాక లక్ష్మి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సోంమల్లు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు రాంపాక నాగయ్య, కడమంచి వస్తాద్, శ్రీనివాస్‌రెడ్డి, విష్ణుమూర్తి, అనిత పాల్గొన్నారు.