బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలి

Mar 20 2023 1:32 AM | Updated on Mar 20 2023 1:32 AM

సూర్యాపేట రూరల్‌: నిలిచిపోయిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షనర్ల పెండింగ్‌ బకాయిలను విడుదల చేయాలన్నారు. పండిట్‌లు, పీఈటీలకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతిలో చేరే వయస్సును 6 సంవత్సరాలుగా నిర్ణయించడం కార్పొరేట్‌ విద్యా సంస్థల కోసం తప్ప ప్రభుత్వ పాఠశాలలకు ఉపయోగపడదని, 5 సంవత్సరాలుగానే ఉంచాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement