పోరాటాల ద్వారా సమస్యల పరిష్కారం

సమావేశంలో మాట్లాడుతున్న రంగారెడ్డి - Sakshi

దురాజ్‌పల్లి (సూర్యాపేట): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయడం ద్వారానే ప్రభుత్వాల మెడలు వంచి సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని కొల్లగొడుతూ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందన్నారు. దేశంలోని 10 శాతం మంది చేతుల్లో 100శాతం సంపద దాగి ఉందన్నారు. నరేంద్రమోదీ పాలనలో పేద, మధ్య తరగతి ప్రజలపై భారాలు మోపుతూ.. పెద్దలకు రాయితీలు కల్పించడం దుర్మార్గమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటమన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, రవి నాయక్‌, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కోట గోపి తదితరులు పాల్గొన్నారు.

ఫ సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి

Read latest Yadadri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top