స్వయం ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ

స్థల పరిశీలన చేస్తున్న బీజేపీ నాయకులు  - Sakshi

భూదాన్‌పోచంపల్లి : స్వయం ఉపాధి కోర్సుల్లో నిరుద్యోగ యువతకు భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురంలో గల స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ పీఎస్‌ఎస్‌ఆర్‌ లక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అకౌంట్స్‌ అసిస్టెంట్‌(ట్యాలీ), ఆటోమొబైల్‌ టు, త్రీ వీల ర్‌ సర్వీసింగ్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ట్యాలీ కోర్సుకు బీకాం, ఆటోమొబైల్‌ పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. అభ్యర్థులు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సున్న వారు అర్హులన్నారు. ఆసక్తి, అర్హత కల్గిన అభ్యర్థులు తమ విద్యార్హతల ఒర్జినల్‌, జిరాక్స్‌లు, పాస్‌ఫొటోలు, ఆధార్‌కార్డుతో మార్చి 1న సంస్థలో నిర్వహించే కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని కోరారు. ఎంపికై న అభ్యర్థులకు హాస్టల్‌ వసతి కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తయిన అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వివరించారు. వివరాలకు 9133908000, 933908111, 9133908222 నంబర్లను సంప్రదించాలని అన్నారు.

శాస్త్రోక్తంగా ఊంజలి సేవ
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజలి సేవ ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ మాఢ, తిరువీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అధిష్టింపజేసి అమ్మవారికి ఊంజలి సేవ చేశారు. అదే విధంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు 28 మంది గైర్హాజరు
భువనగిరి : జిల్లాలో ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన పరీక్షలకు 606 మంది విద్యార్థులకు 578 మంది హాజరయ్యారు. 28 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు.
నేడు ఆలేరుకు
బండి సంజయ్‌ రాక
ఆలేరురూరల్‌ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ శనివారం ఆలేరుకు రానున్నారు. ఆలేరులో జరిగే ప్రజాగోస – బీజేపీ భరోసా కార్నర్‌ సమావేశంలో పాల్గొని మాట్లాడుతారని ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌ నందకుమార్‌యాదవ్‌ తెలిపారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర నాయకులు సూదగానికి హరిశంకర్‌గౌడ్‌, పడాల శ్రీనివాస్‌, వట్టిపల్లి శ్రీనివాస్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్‌తో కలిసి స్థల పరిశీలన చేశారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్‌ చిరిగె శ్రీనివాస్‌, పట్టణ మండల అద్యక్షులు జహంగీర్‌, రాఘవేంద్ర, కౌన్సిలర్‌ సంగు భూపతి, సముద్రాల కల్పన, కృష్ణ, బందెల సుభాష్‌, రాజు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
రామన్నపేట : పంచాయతీరాజ్‌ శాఖ జాయింట్‌ కమిషనర్‌ నర్సింహులు శుక్రవారం రామన్నపేట మండలంలోని వెల్లంకిలో పర్యటించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య చర్యలను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం, కూ రెళ్ల గ్రంథాలయం, అంగన్‌వాడీ కేంద్రం, రైతు వేదికలను తనిఖీ చేశారు. వెల్లంకి జాతీయ పురస్కారానికి పోటీపడుతున్న నేపథ్యంలో గ్రామంలో పర్యటించినట్లు డిప్యూటీ కమిషనర్‌ తెలిపారు. పురస్కారం కోసం తొమ్మిది అంశాలపై పంపిన నివేదికను పరిశీలించారు. పాలకవర్గానికి సూచనలు చేశారు. మార్చి రెండో వారంలో కేంద్ర బృందం పర్యటించనుందని, పంపిన నివేదికలు పక్కాగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సునంద, డీఎల్‌పీఓ సాధన, ఎంపీడీఓ గాదె జలేందర్‌రెడ్డి, సర్పంచ్‌ ఎడ్ల మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీ ఎర్రోళ్ల లక్ష్మమ్మ, ఉపసర్పంచ్‌ రవ్వ అనసూయ పాల్గొన్నారు.
రాజాపేట : మండలంలోని జాల గ్రామాన్ని జాయింట్‌ కమిషనర్‌ సందర్శించారు. పరిసరాలు, పంచాయతీ రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డీపీఓ సునంద, డీఎల్‌పీఓ యాదగిరి, ఎంపీడీఓ జ్ఞానప్రకాష్‌, ఎంపీ దినకర్‌, కార్యదర్శి ఉమేష్‌, సర్పంచ్‌ మధుసూదన్‌రెడ్డి ఉన్నారు.

Read latest Yadadri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top