న్యూస్‌రీల్
జిల్లాలో రబీ సాగు
విస్తీర్ణం 2.31 లక్షల ఎకరాలు
ధాన్యం దిగుబడి 9.50 లక్షల టన్నులు
(అంచనా)
సేకరణ లక్ష్యం 8 లక్షల టన్నులు
అన్నదాన భవనానికి విరాళం
కాళ్ల: కాళ్లకూరులో వేంకటేశ్వరస్వామి దేవస్థానం అన్నదాన భవనానికి వేగేశ్న వీఎస్ రాజు, కుమార్తెలు శ్రీఅంజలి, సంజన రూ.3 లక్షలు విరాళంగా అందించారు.
దళారులదే హవా
మంగళవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2026
సాక్షి, భీమవరం: సంచులకు కొరత లేదని అధికారులు చెబుతుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితికి అందుకు భిన్నంగా ఉంది. ధాన్యంలో తేమ పేరిట ఆర్‌ఎస్‌కేల్లో సంచుల కోసం షరతులు పెడుతూ కాలయాపన చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. సకాలంలో సంచులు అందక.. సంచులు దొరికితే పట్టుబడి పట్టేందుకు జట్టు రాక.. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియక.. పంటను కాపాడుకునేందుకు కర్షకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
పంటను కాపాడుకునేందుకు పడిగాపులు
డీజిల్ కొరతతో మొదట్లో వరికోతలు ఆలస్యమయినా కొద్దిరోజులుగా పనులు పుంజుకున్నాయి. దాదాపు 70 శాతం విస్తీర్ణంలో వరికోతలు పూర్తయ్యాయి. కొద్దిరోజుల క్రితం వరకు సంచులకు కొరత లేకపోయినా ప్రస్తుతం పనులు ముమ్మరం కావడంతో సంచులకు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. పంట కోసి సంచుల కోసం ఆర్‌ఎస్‌కేల వద్దకు వెళుతుంటే తగినంత తేమశాతం వచ్చాక ఇస్తామని తిప్పించుకుంటున్నారని వాపోతున్నారు. వారం క్రితం కోతలు కోసి ధాన్యం ఆరబెట్టుకున్న రైతులు, సకాలంలో సంచులు అందక, పట్టుబడికి జట్టు దొరక్క రోడ్లు పక్కన, కళ్లాల్లోను రాశులు పోసి ఉంచుతున్నారు. మార్టేరు నుంచి పెనుమంట్ర వరకు రోడ్డు పక్కన ధాన్యం నిల్వ చేసిన పలువురు రైతులను సోమవారం ‘సాక్షి’ సంప్రదించగా ఈ సమస్యను వివరించారు. నాలుగైదు రోజులు పోయాక సంచులు దొరికాయని సంబరపడితే పట్టుబడి కోసం జట్టు కార్మికులు రాక ధాన్యాన్ని రోడ్డుపక్కన ఉంచి పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోయారు. ఆదివారం కురిసిన వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు కూలీలు తడిసి మోపెడవుతున్నాయన్నారు. సకాలంలో సంచులు అందజేసి ఉంటే ఈ దుస్థితి వచ్చి ఉండేదికాదని ఈపాటికే ఒబ్బిడి చేసుకునే వాళ్లమని వివరించారు. గత మూడు సీజన్లుగా ఇదే పరిస్థితి ఎదురవుతోందని, వచ్చిన సంచులు చాలా వరకు పాడైపోయి ఉంటున్నాయని తెలిపారు. రైతు సేవా కేంద్రాల్లో సరిపడ తేమశాతం ఉందని చెబుతుంటే మిల్లులు వద్ద తేమ ఉందని చెప్పి ధాన్యం తీసుకునేందుకు నిరాకరిస్తుండటంతో గిట్టుబాటు ధరకు కాకుండా వారు చెప్పిన ధరకే అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మాసూళ్లు ముమ్మరంగా జ రుగుతున్న పెనుమంట్ర, పాలకొల్లు, పెనుగొండ, పోడూరు, వీరవాసరం, ఆచంట తదితర ప్రాంతాల్లో సమస్య ఉన్నట్టు రైతులు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపఽథ్యంలో సంచు లు, పట్టుబడి, రవాణ సమస్యల పరిష్కారానికి చ ర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
సమస్యలపై సివిల్ సప్లయీస్ డీఎం ఇబ్రిహీంను సంప్రదించగా.. జిల్లాలో సంచుల కొరత లేదని, 2 కోట్ల సంచులు అవసరం కాగా ఇప్పటికే 1.70 కోట్ల సంచులు అందించామని, వాటిలో కోటి సంచులు ప్రొక్యూర్ చేయగా మిగిలినవి ఆర్‌ఎస్‌కేలోనే ఉన్నాయని తెలిపారు.
కష్టాల సాగు
ధాన్యం పట్టుబడులకు సంచుల కొరత
ఆర్‌ఎస్‌కేల చుట్టూ రైతుల ప్రదక్షిణలు
పట్టుబడుల కోసం జట్లు దొరక్క ఇక్కట్లు
ఆందోళన కలిగిస్తున్న వాతావరణం
జిల్లాలో 2.31 లక్షల ఎకరాల్లో రబీసాగు
70 శాతం పూర్తయిన వరికోతలు
9.5 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా
కూటమి ప్రభుత్వం వచ్చాక ధాన్యం సేకరణ ప్రక్రియలో కమీషన్ వ్యాపారుల హవానే నడుస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు చెప్పిన వారికే ఆర్‌ఎస్‌కేల నుంచి సంచులు సరఫరా చేస్తున్నారని, సన్న చిన్నకారు, కౌలు రైతులను తేమశాతం పేరి ట రోజుల తరబడి తిప్పించుకుంటున్నారని అంటున్నారు. పట్టుబడి కోసం జట్టు సరఫరా, మిల్లులకు ధాన్యం రవాణ అంతా వారి కనుసన్నల్లోనే జరుగుతుందంటున్నారు. ప్రస్తుత దుస్థితికి దళారులే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు.


