చిరు వ్యాపారులకు గుదిబండ | - | Sakshi
Sakshi News home page

చిరు వ్యాపారులకు గుదిబండ

May 5 2026 9:31 AM | Updated on May 5 2026 9:31 AM

వాణిజ్య సిలిండర్‌పై ఒక్కసారిగా రూ.993 పెంపు

హోటల్స్‌, స్వీట్‌ షాపులు, చిరు వ్యాపారులకు అదనపు భారం

టిఫిన్స్‌, భోజనం రేట్లు పెరిగే అవకాశం

పెనుభారమే..

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి సబ్బిశెట్టి భద్రం. భీమవరంలో చాలా కాలంగా తోపుడు బండిపై బజ్జీల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇప్పుడు వాణిజ్య గ్యాస్‌ ధర భారీగా పెంచడంతో ఆయన వ్యాపారానికి భారంగా మారింది. చిరు వ్యాపారులకు సబ్సిడీపై గ్యాస్‌ అందించేలా ప్రభుత్వం చర్యలు కోరుతున్నారు.

కమర్షియల్‌ గ్యాస్‌తో బజ్జీల వ్యాపారం చేస్తున్న చిరువ్యాపారి (ఫైల్‌)

భీమవరం: గోరుచుట్టుపై రోకలి పోటులా వాణిజ్య గ్యాస్‌ ధరల పెంపుతో చిరువ్యాపారులు కుదేలవుతున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.993 పెంచి హోటల్స్‌, చి న్న బడ్డ్డీ కొట్లు నడుపుతున్న వారి పొట్టకొట్టింది. యుద్ధం పుణ్యమా అంటూ గ్యాస్‌ సక్రమంగా లభించక గత నెలలో చాలామంది తమ వ్యాపారాన్ని మూసివేయగా ఇప్పుడిప్పుడే తిరిగి తెరుచుకునే ప్రయత్నంలో ప డ్డారు. వాణిజ్య గ్యాస్‌ సక్రమంగా లభించకపోవడంతో కొంత మంది బ్లాక్‌లో పెద్ద మొత్తం చెల్లించి సిలిండర్స్‌ కొన్నారు. మరి కొందరు పుల్లల పొయ్యిలపై వంటలు ప్రా రంభించారు. అరకొరగా లభిస్తున్న వాణిజ్య గ్యాస్‌తో హోటల్స్‌, స్వీట్స్‌ షాపులు వంటివి నడుస్తుంటే గ్యాస్‌ ధర పెంచడంతో ఈ వ్యాపారుల పరిస్థితీ అగమ్యగోచరంగా తయారైంది.

అల్పాహారం, భోజనం ధరలకు రెక్కలు

జిల్లాలో సుమారు 50 వరకు హెచ్‌పీసీఎల్‌, ఐఓసీఎల్‌, బీపీసీఎల్‌ గ్యాస్‌ ఏజెన్సీలుండగా వాటి ద్వారా దాదాపు 7 లక్షల వరకు కమర్షియల్‌, డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలెండర్స్‌ సరఫరా జరుగుతోంది. వాటిలో 6.21 లక్ష ల గృహావసరాల గ్యాస్‌ సిలిండర్స్‌ ఉన్నాయి. కమర్షి యల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర గతంలో రూ.1,800 మా త్రమే ఉండగా అమెరికా–ఇరాన్‌ యుద్ధం కారణంగా మార్చిలో గ్యాస్‌ ధర రూ.2,177కు పెంచారు. కనీసం రెండు నెలలు కూడా గడవకముందే కమర్షియల్‌ గ్యాస్‌ ధరను రూ.993కు పెంచడంతో ప్రస్తుతం వినియోగదారులు రూ.3,170 చెల్లించాల్సి వస్తుంది. పెరిగిన గ్యాస్‌ ధరలతో హోటల్స్‌, బజ్జీ కొట్లు, స్వీట్స్‌ షాపుల యజమానులు ఆహార పదార్థాల ధరలను పెంచే ప్రమాదముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్యాస్‌ అక్రమ వాడకం పెరిగే అవకాశం

వాణిజ్య గ్యాస్‌ ధరలను ప్రభుత్వం పెంచడంతో గృహావసరాల గ్యాస్‌ సిలిండర్స్‌ అక్రమ వాడకం పెరిగి గృహ వినియోగదారులకు మరిన్ని ఇబ్బందులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్‌ గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరగడంతో వాటిని ఉపయోగించే వ్యాపారులు అక్రమంగా డొమెస్టిక్‌ గ్యాస్‌ వాడకం పెరుగుతుందని దాంతో బ్లాక్‌ మార్కెట్‌ పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement