సత్వర పరిష్కారం చూపాలి | - | Sakshi
Sakshi News home page

సత్వర పరిష్కారం చూపాలి

May 5 2026 9:31 AM | Updated on May 5 2026 9:31 AM

సత్వర పరిష్కారం చూపాలి విజేతగా ‘అమ్మ చెక్కిన బొమ్మ’ అర్జీల పరిష్కారానికి శ్రద్ధ పెట్టాలి

భీమవరం: స్థానిక పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి నిర్వహించారు. 16 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలపై త్వరితగతిన స్పందించి నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఫోన్‌లో ఆదేశించారు. మహిళా పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీ యు.రవిచంద్ర, జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ కేవీవీఎన్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

యలమంచిలి: కొంతేరులో పులపర్తి వీరాస్వామి యూత్‌ క్లబ్‌ కళామందిర్‌ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన 44వ అఖిల భారత స్థాయి నాటిక పోటీల్లో గోవాడ క్రియేషన్స్‌ (హైదరాబాద్‌) వారి అమ్మ చెక్కిన బొమ్మ ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. అభినయ ఆర్ట్స్‌ (గుంటూరు) వారి అమ్మ చెక్కిన బొమ్మ, తృతీయ ప్రదర్శనగా చైతన్య కళా స్రవంతి (విశాఖ) వారి అగ్నిసాక్షి నాటికలు నిలిచాయి. యూత్‌ కమిటీ అధ్యక్షుడు అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో పాలకొల్లు చాంబర్స్‌ కళాశాల రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ చేగొండి సత్యనారాయణమూర్తి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఉన్నమట్ల కబర్థి, కళాకారుడు మానాపురం సత్యనారాయణ చేతుల మీదుగా నగదుతో పాటు షీల్డ్‌లు అందజేశారు. యూత్‌ క్లబ్‌ గౌరవ అధ్యక్షుడు పులపర్తి రాజగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): ప్రజల నుంచి పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్‌ఎస్‌లో 81, రెవెన్యూ క్లినిక్‌లో 40 అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీపై సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదికలు సమర్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్‌ అప్పారావు, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి ఎన్‌.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement