ప్రశాంతంగా లాసెట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా లాసెట్‌

May 5 2026 9:31 AM | Updated on May 5 2026 9:31 AM

ప్రశాంతంగా లాసెట్‌ స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌ తప్పనిసరి రైలు ఢీకొని వ్యక్తి మృతి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): లా కోర్సుల్లో ప్రవేశాల కోసం సోమవారం నగరంలో నిర్వహించిన లాసెట్‌కు 518 మంది విద్యార్థులు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్‌ స్కూల్‌లో ఉదయం170 మందికి 134 మంది, మధ్యాహ్నం 171 మందికి 152 మంది, సీఆర్‌ఆర్‌ కళాశాలలో ఉదయం 200 మందికి 158 మంది, ఏలూరు ఇంజనీరింగ్‌ కళాశాలలో 92 మందికి 74 మంది హాజరయ్యారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలోని స్కూల్‌, కాలేజీ బ స్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు తప్పక చేయించాలని జిల్లా రవాణా శాఖ అధికారి కృష్ణారావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 5 తనిఖీ బృందాలు ఏర్పాటు చేశామని, కళాశాల, పాఠశాలలకు వెళ్లి బస్సులను తనిఖీ చేస్తామన్నారు. ఫిట్‌నెస్‌ లేని బస్సులకు నోటీసులు జారీ చేస్తామని, అవసరమైతే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

భీమడోలు: బహిర్భూమికి వెళ్లిన మతిస్థిమితం లేని వ్యక్తిని సోమవారం వేకువజామున పాతూరు రైల్వేగేటు వద్ద రైలు ఢీకొట్టింది. దీంతో గుండుగొలను సమీపంలోని కొత్తగూడేనికి చెందిన నారాయణపురపు దుర్గారావు (43) మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఏలూ రు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement