కమర్షియల్ గ్యాస్ ధర ఒక్కసారిగా రూ. 993 పెంచడం దారుణం. ఇప్పటికే గ్యాస్ సక్రమంగా సరఫరా గాక ఇబ్బందులు పడుతుండడంతో గతంలో రోజుకు నాలుగు సిలిండర్స్ వాడగా ప్రస్తుతం రెండు సిలిండర్స్‌తోనే సరిపెడుతున్నాం. ఫుడ్ ధరలు పెంచక తప్పకపోవచ్చు.
– చంద్రిక మూర్తి, చంద్రిక రెస్టారెంట్, భీమవరం
కమర్షియల్ గ్యాస్ ధరలు ఇంత భారీగా గతంలో ఎన్నడూ పెరిగిన దాఖలాలు లేవు. పోటీ ప్రపంచంలో అంతంత మా త్రంగానే వ్యాపారంతో నెట్టుకొస్తుంటే గ్యాస్ ధర జీవనానికి గుదిబండగా మారుతోంది. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించి ఆదుకోవాలి.
– కనమర్లపూడి రాము, వ్యాపారి, భీమవరం


