భీమవరం (ప్రకాశంచౌక్): మావుళ్లమ్మవారి నిత్యాన్నదానానికి చినఅమిరానికి చెందిన కోరాడ శ్రీనివాస్, కీర్తి దంపతులు రూ.1,00,116 విరాళంగా అందజేశారు.
సంచుల కోసం చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఆర్‌ఎస్‌కేల్లో దళారులు, పెద్ద రైతులు తమ పలుకుబడితో సంచులు తీసుకెళ్లిపోతున్నారు. సామాన్య, కౌలు రైతులను మాత్రం తేమ పేరు చెప్పి రోజులు తరబడి తిప్పించుకుంటున్నారు. సంచులు, పట్టుబడి, రవాణా సమస్యలు పరిష్కరించాలి.
– బి.శ్రీనివాస్, కౌలురైతు, ఆలమూరు
మూడున్నర ఎకరాల్లో సాగు చేశాను. మొన్న సోమవారం పంట కోస్తే శనివారం సంచులు ఇచ్చారు. పట్టుబడి చేద్దామంటే జట్టు రావడం లేదంటున్నారు. వాతావరణం చూస్తుంటే భయమేస్తోంది. ఆదివారం వర్షం నుంచి పంటను కాపాడుకునేందుకు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది.
– నారాయణ, రైతు, కోమటి చెరువు


