ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌కు టీచర్ కళ్యాణి
దెందులూరు: హర్యానాలో పంచకులలో జరుగుతున్న ఆల్ ఇండియా సైన్స్ ఫెస్టివల్‌కు దెందులూరు గారపాటి హైమావతి దేవి ఉన్నత పాఠశాల సైన్స్ టీచర్ కళ్యాణి డెలిగేట్‌గా ఎంపికయ్యారు. గురువారం హర్యానా సైన్స్ ఫెస్టివల్‌లో ఆమె పాల్గొన్నారు. విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచిని పెంచేందుకు వినూత్న ప్రణాళికలతో, విధానాలతో శిక్షణ పొంది రావడం గొప్ప అనుభూతి అని ఆమె అన్నారు. దేశ, విదేశాల శాస్త్రవేత్తలు హర్యానా ముఖ్యమంత్రి, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి, ఇతర ప్రముఖ విశ్వవిద్యాలయాల పరిశోధకులు, విజ్ఞాన భారతి అధ్యక్ష కార్యదర్శుల మధ్య కార్యక్రమం వైభవంగా జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా 200 మంది సైన్స్ టీచర్లు ఎంపికై న ఈ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామి కావడం సంతోషం కలిగించిందన్నారు.
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి దేవాలయ హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. జిల్లా దేవదాయ శాఖ అధికారికి కూచిపూడి శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆదాయాన్ని లెక్కించారు. 63 రోజులకు గాను రూ.48,82,724, అన్నదానం హండీ ద్వారా రూ. 2,08,802 మొత్తం రూ. 50,91,526 ఆదాయం సమకూరినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు.
భీమవరం: పోలీసులకు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంలో క్రీడా కార్యక్రమాలు ఒత్తిడిని తగ్గించి నాయకత్వం, పరస్పర గౌరవం, జట్టు భావనను పెంపొందిస్తాయని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. భీమవరం డీఎన్నార్ కళాశాల ఆవరణలో బుధవారం ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాల ప్రతినిధులతో ఏర్పడిన జట్లు క్రీడాస్ఫూర్తితో పోటీపడి ఆకట్టుకున్నారు. క్రికెట్ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగగా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నేతృత్యంలో ఎస్పీ ఎలెవన్ టీమ్, తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ టీంపై విజయం సాధించింది. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, నర్సాపురం డీఎస్పీ జి.శ్రీవేద, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ, ఆర్మర్‌డ్డ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ కె.వెంకట్రావు, భీమవరం టూటౌన్, రూరల్ సీఐలు జి.కాళీచరణ్, బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌కు టీచర్ కళ్యాణి
ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌కు టీచర్ కళ్యాణి


