వ్యాన్ ఢీకొని వృద్ధుడి మృతి
నరసాపురం రూరల్: సైకిల్‌పై వెళుతున్న వృద్ధుడిని వ్యాన్ ఢీకొట్టడంతో మృతి చెందాడు. మొగల్తూరు ఎస్సై వై.నాగలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం పేరుపాలెం సౌత్ గ్రామానికి చెందిన బోణం నర్సింహరావు (75) గ్రామంలో సైకిల్‌పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సింహరావు అక్కడికక్కడే మృతి చెందాడు. నర్సింహరావు కుమారుడు వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నట్లు చెప్పారు.


