ఉపాధ్యాయులకు వేధింపులు
భీమవరం: ఉపాధ్యాయులు సెలవు రోజున కూడా పనిచేయాలని వేధించడం సరికాదని ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.సాయిశ్రీనివాస్ అన్నారు. సోమవారం అంబేడ్కర్ భవన్‌లో ఎస్‌టీయు జిల్లా శాఖ 79వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడితో బోధనేతర పనులు పనిచేస్తున్నప్పటికీ ఆదివారం కూడా పాఠశాలలో పనిచేయాలని వంద రోజుల షెడ్యూల్ అమలు చేయాలని వేధింపులకు గురి చేయడం మానుకోవాలని సాయి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు రూ.30 వేల కోట్లు చెల్లించడానికి తక్షణం రోడ్ మ్యాప్ ఇవ్వాలని, 12వ పీఆర్సీ కమిటీని నియమించాలన్నారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పీఆర్‌విఎస్ సాయివర్మ, కెవీ రామచంద్రరావు, ఆర్థిక కార్యదర్శిగా పీవీడి ప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వహకులుగా గుత్తుల శ్రీనివాస్, డి దావీదు, తదితరులను ఎన్నుకున్నారు.


