హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక
కామవరపుకోట: జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఆడమిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంటా రవిచంద్రమోహన్ సోమవారం తెలిపారు. నవంబర్ 28 నుంచి 30 వరకు చిత్తూరు జిల్లా కలికిరిలో జరిగిన రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలలో అండర్ 14 విభాగంలో పాఠశాలకు చెందిన 9 వ తరగతి విద్యార్థిని కొండపర్తి పూజిత విశేష ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఈ విద్యార్థిని త్వరలో రాజస్థాన్‌లో జరగబోయే జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలలో పాల్గొననట్లు తెలిపారు.
తణుకు అర్బన్: పశ్చిమగోదావరి జిల్లా అండర్ 16, 18, 20 బాలురు, బాలికలు, పురుషులు, సీ్త్రల క్రాస్ కంట్రీ (రోడ్ రన్) జట్ల ఎంపికలు సోమవారం తణుకు డీమార్ట్ ప్రాంతంలో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 200 మంది హాజరుకాగా వారిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన 22 మందిని ఎంపిక చేసినట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంకు సూర్యనారాయణ తెలిపారు. పోటీలను అసోసియేషన్ అధ్యక్షుడు చింతకాయల సత్యనారాయణ ప్రారంభించారు. ఎంపికై న జట్లు ఈ నెల 24న పెద్దాపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని వివరించారు. ఎంపిక పోటీలను అసోసియేషన్ కోశాధికారి కె.బాబురావు, వ్యాయామ ఉపాధ్యాయురాలు కె.ఈశ్వరి పర్యవేక్షించారు.
భీమవరం: ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం శంభాల చిత్ర బృందం సందడి చేసింది. శంభాల సినిమా ఈనెల 25న విడుదలను పురస్కరించుకొని ప్రమోషన్‌లో భాగంగా కళాశాలకు వచ్చిన చిత్ర బృందం విద్యార్థులతో డ్యాన్స్ చేసింది. కార్యక్రమంలో హీరో, హీరోయిన్స్ ఆది సాయికుమార్, అర్చన, దర్శకుడు యుగంధర్ ముని, చిత్ర నిర్మాత రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మావుళ్లమ్మ అమ్మవారిని చిత్ర బృందం దర్శించుకుంది. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు .
నిడమర్రు: ఇటీవల గుణపర్రులో వరుస చోరీల కేసును నిడమర్రు పోలీసులు ఛేదించారు. సోమవారం నిడమర్రు పీఎస్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐ ఎన్.రజనీకుమార్, ఎస్సై ఎస్‌ఎన్‌వీవీ రమేష్ కేసు వివరాలు తెలిపారు. గుణపర్రులో సెప్టెంబరు 29 రాత్రి వరుస చోరీలు జరిగాయని, సీసీ పుటేజీ, ఆధునిక సాకేంతికత సహాయంతో నిందితుడిని గుర్తించామన్నారు. అదే గ్రామానికి చెందిన కాకులపాటి పూర్ణ సుభాష్ (26)గా నిందితుడిని గుర్తించారు. సుమారు 6 లక్షల విలువైన 48 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాఽధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఏలూరు (టూటౌన్): ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో జరిగిన హత్య కేసులో నిందితుడు బత్తిన బ్రహ్మయ్య అలియాస్ రాంబాబుకు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా 2వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ న్యాయమూర్తి ఇందిరా ప్రియదర్శిని సోమవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చింతమనేని రమేష్ వాదనలు వినిపించారు.
ద్వారకాతిరుమల: తన జీవితం ఆలయ అభివృద్ధికే అంకితమని చినవెంకన్న దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు అన్నారు. సోమవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈవో ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి, ఈఈ డీవీ భాస్కర్, డిప్యూటీ ఈవో భద్రాజీ తదితరులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక
హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక
హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక


