కార్తీక శోభ
కార్తీక మాసం మొదటి సోమవారం జిల్లాలోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. భీమవరం పంచారామక్షేత్రంలో ఉమాసోమేశ్వరస్వామికి విశేష పూజలు నిర్వహించారు. పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఈ రెండు క్షేత్రాలకు జిల్లా నలుమూలతో పాటు ఇతర జిల్లాల నుంచి యాత్రికులు భారీగా తరలిరావడంతో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ద్వారకా తిరుమల శివాలయం, మద్ది క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు.
– సాక్షి నెట్‌వర్క్
దూసుకొస్తున్న మోంథా
కార్తీక శోభ
కార్తీక శోభ


