50 మంది పని 19 మంది చేస్తున్నారు
తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన పనికి వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటు. 4 నెలలపాటు వేతనాలు లేక కార్మికులు అల్లాడుతుంటే ప్రభుత్వానికి, అధికారులకు చీమకుట్టినట్లుగా లేదు. ఆస్పత్రిలో 50 మంది చేయాల్సిన పనిని కేవలం 19 మందితో చేయిస్తున్నారు. – కోనాల భీమారావు,
ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, తణుకు శాఖ అధ్యక్షుడు
4 నెలలపాటు జీతాలివ్వకపోతే మా బిడ్డలను ఎలా పోషించుకోమంటారు. ఆసుపత్రిలో 50 మంచాలతో ఉన్ననాటి నుంచి 19 మందితో పనిచేస్తున్నాం. నేడు 200 మంచాలకు పెరిగి 50 మంది కార్మికుల అవసరం ఉన్నా ఆ 19 మందిమే చెమట కక్కుతూ పనిచేస్తున్నాం. అయినా జీతాలు సక్రమంగా అందడం లేదు.
– ధర్మాని పుష్పలత, పారిశుధ్ధ్య కార్మికురాలు
ప్రభుత్వాసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో ఉన్న మాకు వేతనాలు ఇవ్వకపోవడంతో మా బిడ్డలకు మూడు పూటలా అన్నం కూడా పెట్టలేని దుస్థితిలో ఉన్నాం. కాంట్రాక్టర్ ఇవ్వలేనప్పుడు మా జీతాలు ప్రభుత్వం అయినా చెల్లించాలి. మా పేద బతుకులకు 4 నెలల జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకమంటారు. వెంటనే జీతాల బకాయిలు చెల్లించాలి.
– బి.ప్రసన్న కుమారి, పారిశుద్ధ్య కార్మికురాలు
50 మంది పని 19 మంది చేస్తున్నారు
50 మంది పని 19 మంది చేస్తున్నారు


