ప్రాణాలు తీస్తున్న గుంతల రోడ్లు
కై కలూరు: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారింది కై కలూరు నియోజకవర్గ పరిస్థితి. ఆక్వా ఉత్పత్తులతో ఆదాయంలో అగ్రస్థానంలో ఉన్నా రోడ్లపై ప్రయాణమంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. చిన్నపాటి వర్షాలకే రహదారులు తటాకాలుగా కనిపిస్తున్నాయి. రోడ్డు ఏదో, గుంత ఎక్కడుందో గుర్తించలేని పరిస్థితి. పామర్రు–దిగమర్రు 216 జాతీయ రహదారిలో గుంతల సమస్య జఠిలమవుతోంది. జాతీయ రహదారి విస్తరణ పనులు ఆలస్యం అవుతోన్నాయి. వీటి నిర్మాణాలకు తీసిన గుంతలలో నీరు నిల్వ ఉంటూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
అధిక లోడ్లతో రోడ్లు ఛిద్రం
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో చేపల, రొయ్యల సాగు జరుగుతోంది. కై కలూరు నియోజకవర్గంలో కై కలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో మొత్తం 84,852.4 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. కై కలూరు పరిసర ప్రాంతాల్లో ప్రతి రోజు వందల లారీల ఎగుమతులు ఇతర ప్రాంతాలకు వెళ్తాయి. 10 చక్రాల లారీ సరుకుతో కలిపి 25 టన్నులు, 12 చక్రాల లారీ 30 టన్నుల బరువు ఉంటుంది. కూటమి పాలనలో అక్రమ మైనింగ్ టిప్పర్లు నిత్యం తిరుగుతున్నాయి. కై కలూరు ప్రాంతంలో హైవే పనులకు మట్టి అవసరం కావడంతో అధిక లోడ్లతో టిప్పర్లు రహదారులను పాడుచేస్తున్నాయి.
గుడివాడ, ఏలూరు వంటి ప్రాంతాల నుంచి కై కలూరు మీదుగా భీమవరం వెళ్ళే వాహదారులు ఇదేం కర్మరా బాబూ! అంటూ అసహానం వ్యక్తం చేస్తున్నారు. హైస్కూల్ వద్ద భారీ గుంతలు భయపెడుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్‌లో గుంతల కారణంగా ప్రయాణికులు, బస్సు డ్రైవర్లు నానా తిప్పలు పడుతున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో వర్షపు నీరు చేరుతుంది. టౌన్‌హాలు వద్ద వర్షం కురిస్తే పెద్ద కాల్వలా రోడ్డు మారుతుంది.
ప్రమాదకరంగా పామర్రు–దిగమర్రు జాతీయ రహదారి
ప్రాణాలు తీస్తున్న గుంతల రోడ్లు
ప్రాణాలు తీస్తున్న గుంతల రోడ్లు


