ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
పాలకొల్లు సెంట్రల్: మండలంలోని దిగమర్ర గ్రామానికి చెందిన పెచ్చెట్టి ఆంజనేయులు (52) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి దిగమర్రు నుంచి చించినాడ వెళ్తున్న ఆంజనేయులను వెనుక నుంచి వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్ర గాయాలైన ఆంజనేయులును స్థానికులు పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై బి.సురేంద్రకుమార్ కేసు నమోదు చేశారు.
ఆకివీడు: మండలంలోని మందపాడు శివారు పెద ఉప్పరగూడెంలోని రొయ్యల చెరువుపై పనిచేస్తున్న భూటారి సంజీవరావు(45) విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు ఆదివారం చెప్పారు. గ్రామంలోని పెరుమాళ్ల పెద వెంకటేశ్వరరావు చెరువుపై పనిచేస్తున్న సంజీవరావు అల్లూరి సీతారామరాజు జిల్లాకు వాసి అని తెలిపారు. అతని సోదరుడు దేవా ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పెనుగొండ: ములపర్రు శివారు పితానివారి పాలెంకు చెందిన జక్కంశెట్టి సతీష్(24) అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశామని పెనుగొండ ఎస్సై కే గంగాధర్ తెలిపారు. ఆదివారం తెల్లావారుజామున ఇంటి నుంచి యాక్టివాపై వెళ్లిపోయినట్లు సోదరుడు వినోద్‌కుమార్ ఫిర్యాదు చేసినట్లు వివరించారు. మోటార్ సైకిల్ దొంగరావిపాలెం బ్రిడ్జి వద్ద పార్కు చేసిఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. పరిసర ప్రాంతాల్లో ఎంత వెదికినా ఆచూకీ లభించకపోవడంతో ఫిర్యాదు చేశారన్నారు. గోదావరిలో దూకారన్న అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిపారు.


