పెద్దింట్లమ్మా.. రక్షించమ్మా
కై కలూరు: అమ్మా.. కొల్లేటికోట పెద్దింట్లమ్మా.. నీ చల్లని ఆశీస్సులతో మమ్ములను రక్షించమ్మా.. అంటూ భక్తులు ఆర్తీతో వేడుకున్నారు. జోరున వర్షం కురుస్తున్నా సమీప జిల్లాల నుంచి ఆదివారం భక్తులు కొల్లేటికోటలో అమ్మను దర్శించుకున్నారు. కోనేరులో స్నానాలు ఆచరించి, అమ్మకు పొంగళ్లు, వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున రూ.40,877 ఆదాయం వచ్చిందని చెప్పారు.
పెద్దింట్లమ్మా.. రక్షించమ్మా


