చేనేత రంగాన్ని కాపాడాలి
భీమవరం (ప్రకాశంచౌక్): అంతరించిపోతున్న హ స్తకళలు, చేనేత ఉత్పత్తుల పునర జ్జీవానికి క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో చేనేత, జౌళి శాఖ, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో చేనేతదారులు, కార్మికుల సన్మాన కార్యక్రమానికి ఆమె ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. చేనేత రంగాన్ని కా పాడుకోవాల్సి అవసరం ఉందన్నారు. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ సంస్థ సెక్రటరీ ఎస్.రంజనా మాట్లాడు తూ చేనేత రంగాన్ని, చేనేత కార్మికులను ఆదుకునేందుకు కౌన్సిల్ తరఫున అవగాహన కార్యక్రమాలు చే పడుతున్నామన్నారు. అనంతరం నైపుణ్యంతో చే నేత ఉత్పత్తులు తయారుచేస్తున్న చింతపర్రుకి చెందిన వీర గణపతి, వాసా భ్రమరాంబ, కె.వీరనరసన్నకు రూ.25 వేల నగదు బహుమతులను కలెక్టర్ చేతుల మీదుగా అందించాలనే అలాగే చింతపర్రు, భగ్గేశ్వరం, రాయకుదురు, పాలకొల్లు, రామచంద్రపురం, దగ్గులూరు, భీమవరం, ఆచంట వేమవరం గ్రామాలకు చెందిన చేనేత కార్మికులను చేనేత కండువాతో కలెక్టర్ సన్మానించారు. జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి ఎ.అప్పారావు, డీఆర్‌డీఏ పీడీ ఎంఎస్‌ఎస్ వేణుగోపాల్, క్రాఫ్ట్ కౌన్సిల్ వైస్ చైర్మన్ బి.సుజాత, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.


