మేతల యాజమాన్యం ఆక్వాలో ప్రాముఖ్యం
ఉండి: మేతల యాజమాన్య పద్ధతులే ఆక్వాలో అత్యత ప్రాముఖ్యమైనవని విజయవాడ సీఐఎఫ్‌ఏ శాస్త్రవేత్త డాక్టర్ రమేష్‌రాథోడ్, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. ఆక్వాలో మేతల తయారీ, యాజమాన్య పద్ధతులపై ఎన్నార్పీ అగ్రహారం మత్స్యపరిశోధనా కేంద్రంలో మూడు రోజుల పాటు విద్యార్థులు, రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన శాస్త్రవేత్తలు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆక్వాసాగులో నాణ్యమైన మేతలను సరైన మోతాదులో వినియోగిస్తేనే మంచి దిగుబడులను సాధించగలరని అన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ చంద్రశేఖరరావు మాట్లాడుతూ రొయ్యలు, చేపల లార్వాకు సమతుల్య ఆహారం రోగనిరోధకశక్తి, వేగవంతమైన వృద్ధి కలిగిస్తుందని తెలిపారు. కార్యక్రమాల్లో సైంటిఫిక్ స్టాఫ్ భీమేశ్వరరావు, ధీరణ్, శివకుమార్, షష్టి రిష పాల్గొన్నారు.


