నాడు పల్లె వైద్యానికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

నాడు పల్లె వైద్యానికి పెద్దపీట

May 29 2025 12:48 AM | Updated on May 29 2025 1:23 AM

నాడు పల్లె వైద్యానికి పెద్దపీట

నాడు పల్లె వైద్యానికి పెద్దపీట

గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆధునిక వసతులతో హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణం చేసింది. వైద్యుడి రూమ్‌, ల్యాబ్‌, స్థానికంగా వైద్య సిబ్బంది నివాసం ఉండేందుకు, ఇతర వసతులతో వీటి నిర్మించారు. జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి, మంచాన పట్టిన వారికి ఇంటికి వద్దకే వెళ్లి వైద్యసేవలు అందించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైద్య శిబిరాల నిర్వహణ లేకపోవడంతో వైద్యకోసం పేదలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

అన్నదాతలకు అండగా ఆర్బీకేలు

అన్నదాతల అండగా ఆర్బీకే వ్యవస్థను తెచ్చి సాగులో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. విత్తు నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకు రైతులకు భరోసా కల్పించారు. సబ్సిడీపై విత్తనాలు, ఎరువులతో పాటు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు, విపత్తుల సమయంలో ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, బీమా పరిహారం అందించడంలో కీలకపాత్ర పోషించాయి. ఆర్బీకేలను రైతుసేవా కేంద్రాలుగా కూటమి సర్కారు మార్చింది. కొన్ని ఆర్బీకే భవనాలు ఇతర కార్యాలయాలకు వినియోగిస్తుండగా, మరికొన్ని తాళం వేసి కనిపిస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉండిలోని ఆర్‌బీకేను పోలీస్‌ స్టేషన్‌గా మార్చగా పాలకోడేరు సచివాలయ భవనాన్ని తహసీల్దార్‌ కార్యాలయంగా మార్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement