
ముదినేపల్లి రూరల్: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లారీ డ్రైవర్ ఆదివారం మృతి చెందాడు. ముదినేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంచికచెర్ల గ్రామానికి చెందిన షేక్ నాగూల్ మీరా(29) శనివారం శ్రీహరిపురం గ్రోవెల్స్ ఫ్యాక్టరీ గోడౌన్ వద్దకు లారీ లోడ్ దించడానికి వచ్చాడు. గోడౌన్ ప్రాంగణంలో లారీ నుంచి తలను బయటకు పెట్టి లారీ రివర్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ లారీ, గోడౌన్ గోడ మధ్య అతని తల నలిగిపోయింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం షేక్ నాగూల్ మీరా మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.