వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం

May 2 2025 1:34 AM | Updated on May 2 2025 1:34 AM

వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం

వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం

ఏలూరు రూరల్‌ : జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 50 శిక్షణా శిబిరాల్లో ఈనెల 31 వరకూ బాలబాలికలకు వివిధ ఆటలపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి శిబిరంలో సుమారు 30 నుంచి 50 పిల్లలు సాధన చేయనున్నారు. 8 నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలకు శిక్షణ అందించి క్రీడాకారులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ శిబిరాలు నిర్వహిస్తున్నారు. శిక్షణ పూర్తి చేసిన పిల్లలకు ఈనెల 31వ తేదీన పోటీలు నిర్వహించి బహుమతులతో పాటు సర్టిఫికెట్లు అందిస్తామని డీఎస్‌డీఓ బి.శ్రీనివాసరావు తెలిపారు. క్రీడా శిక్షణా శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఏ క్రీడా శిబిరం ఎక్కడంటే..

అథ్లెటిక్స్‌: ఏలూరులో ఏఎస్‌ఆర్‌ స్టేడియం, సీఆర్‌ఆర్‌ కళాశాల, జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చింతలపూడి జడ్పీ పాఠశాల, చేగొండపల్లి టైబల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌, కూచింపూడి ఎంపీయూపీ స్కూల్‌, కై కరం, గోకవరం జడ్పీ పాఠశాలలు.

ఆర్చరీ: రావికంపాడు జెడ్పీ పాఠశాల

బాస్కెట్‌బాల్‌ : నూజివీడులో వీటిహెచ్‌ గ్రౌండ్‌, డీఏఆర్‌ కళాశాల, ఏలూరు ఇండోర్‌స్టేడియం

బాల్‌ బ్యాడ్మింటన్‌ : నూజివీడు వీటీహెచ్‌ గ్రౌండ్‌

చెస్‌ : ఏలూరు స్వర్ణభారతి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌

ఫుట్‌బాల్‌ : పంగిడిగూడెం, నూజివీడు జీఎంహెచ్‌ హాస్పటల్‌ గ్రౌండ్‌, కొయ్యలగూడెం, ఏలూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఏలూరు ఏఎస్‌ఆర్‌ స్టేడియం

హేండ్‌బాల్‌ : ఏలూరులో సీఆర్‌ఆర్‌ పబ్లిక్‌ స్కూల్‌, సీఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, ఏలూరు ఇండోర్‌ స్టేడియం, శనివారపుపేట రాయన్‌ ఇంగ్లీషు మీడియం స్కూల్‌, ఏలూరు కస్తూరిభా బాలికల పాఠశాల, జోగన్నపాలెం ఎస్‌వీఎన్‌ హైస్కూల్‌, ఏలూరు కేపీడీటీ హైస్కూల్‌, నూజివీడు డీఏఆర్‌ కళాశాల

హాకీ : ఏలూరు ఏఎస్‌ఆర్‌ స్టేడియం

జూడో : ఏలూరు సిద్ధార్ధ క్వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌

కబడ్డీ : ఈస్ట్‌ యడవల్లి, జడ్పీ పాఠశాల

ఖోఖో: ఏలూరు సీఆర్‌ఆర్‌ పభ్లిక్‌ స్కూల్‌, ఏలూరు సిద్ధార్ధ క్వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌

రోయింగ్‌ : ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ రిజర్వాయర్‌

టేబుల్‌ టెన్నిస్‌ : ఏలూరులో సిద్ధార్ధ క్వెస్ట్‌ పభ్లిక్‌ స్కూల్‌, సీఆర్‌ఆర్‌ పభ్లిక్‌స్కూల్‌

టెన్నిస్‌ : ఏలూరు సీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల, నూజివీడు జేబీకే క్లబ్‌, వీటీహెచ్‌ గ్రౌండ్స్‌

వాలీబాల్‌ : ఏలూరు సిద్ధార్ధ క్వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌, వట్లూరు జడ్పీ పాఠశాల, కొల్లేటికోట కమ్యూనిటీ హాల్‌ ఎదురుగా

వెయిట్‌లిఫ్టింగ్‌ : చాటపర్రు వెయిట్‌లిఫ్టింగ్‌ హాల్‌, ఏలూరు ఇండోర్‌స్టేడియం, ఏఎస్‌ఆర్‌ స్టేడియం

యోగా : ఏలూరు ఎంఆర్‌ఎఫ్‌ షోరూం ఆప్‌స్టైర్‌ హాల్‌

కయాకింగ్‌ : జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ రిజర్వాయర్‌

స్కేటింగ్‌ : ఏలూరు ఇండోర్‌స్టేడియం

రోయింగ్‌ సమ్మర్‌ కోచింగ్‌ ప్రారంభం

ద్వారకాతిరుమల: స్థానిక వసంత్‌నగర్‌ కాలనీలో జిల్లా స్పోర్ట్స్‌ అధారిటీ ఆఫ్‌ ఏలూరు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత ఇండోర్‌ రోయింగ్‌ సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌ను గురువారం క్యాంప్‌ ఇన్‌చార్జి, కోచ్‌ ఊదర్ల విజయ్‌ ప్రారంభించారు. స్కల్లింగ్‌, రోయింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ తరుణ్‌ కాకాని, కార్యదర్శి ఎన్‌ పవన్‌ కుమార్‌, కోచ్‌ విజయ్‌ మాట్లాడుతూ ఈ ఉచిత క్యాంపును నెలరోజుల పాటు నిర్వహిస్తామన్నారు. పిల్లలకు ఈ కోచింగ్‌ క్యాంప్‌ ఎంతగానో ఉపయోగ పడుతుందని చెప్పారు. పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్‌, పడవల మోహన్‌బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement