దళారులను ఆశ్రయిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

దళారులను ఆశ్రయిస్తున్నాం

Apr 23 2025 7:59 PM | Updated on Apr 23 2025 7:59 PM

దళారు

దళారులను ఆశ్రయిస్తున్నాం

నేను మూడెకరాలు కౌలుకు చేస్తున్నాను. రైతులకు అందిస్తామన్న పెట్టుబడి సాయం ఇంతవరకు ఇవ్వలేదు. పెట్టుబడుల నిమిత్తం దళారులను ఆశ్రయించాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితి పూర్తి అగమ్యగోచరంగా తయారైంది.

– తామరపల్లి ముసలయ్య, కౌలు రైతు, పద్దిరెడ్డిపాలెం

ఒక్క రూపాయి కూడా సాయం లేదు

ఎకరం సొంత భూమితోపాటు 4 ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. గత ప్రభుత్వంలో ఏటా రైతు భరోసా సాయం అందించేవారు. ఏడాది కాలంగా ఒక్క రూపాయి అందలేదు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

– కోరుకొల్లు వెంకట్రావు, రైతు, కంచుమర్రు

ఏడాది గడిచినా సాయం ఊసే లేదు

అన్నదాత సుఖీభవగా ఏటా రూ.20 వేలు చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడాది కావస్తోంది. ఇంతవరకు సాయం ఊసు ఎత్తడం లేదు. చిన్న, సన్నకారు రైతులు ఇబ్బంది పడుతున్నాం.

– గుంటపల్లి వెంకన్న, రైతు, గరగపర్రు

దళారులను ఆశ్రయిస్తున్నాం 
1
1/2

దళారులను ఆశ్రయిస్తున్నాం

దళారులను ఆశ్రయిస్తున్నాం 
2
2/2

దళారులను ఆశ్రయిస్తున్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement