
ఆక్వా అతలాకుతలం
శునకం.. భయానకం
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులపై ఎగబడుతున్నాయి. 8లో u
ఉండి సమావేశం రద్దు
గురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అమెరికా సుంకాల భయంతో రొయ్య రేట్లు పతనం కావడంతో రాష్ట్రంలోని ఆక్వా రంగం భవిష్యత్ అయోమయంలో పడింది. కొనుగోలుదారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరసిస్తూ పశ్చిమ రైతులు పోరుబాట పట్టారు. ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో జూలై నుంచి పంట విరామానికి పిలుపునిచ్చారు. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు సొంత నియోజకర్గమైన ఉండిలో బుధవారం జరగాల్సిన ఆక్వా రైతు సదస్సు వాయిదా పడడం చర్చనీయాంశమైంది.
రాష్ట్రంలోని 5.75 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుంటే అత్యధికంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే 2.63 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉంది. ఏటా దాదాపు మూడు లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తితో జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉంది. స్థానికంగా 40కు పైగా ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. కిలోకు 20 నుంచి 50 లోపు కౌంట్ రొయ్యలు అమెరికాకు ఎగుమతి అవుతుంటే, 60 నుంచి 100 వరకు కౌంట్ రొయ్యలు చైనా, యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. అమెరికాకు రొయ్యల ఎగుమతుల్లో 40 శాతం జిల్లా నుంచే వెళ్తున్నాయి.
ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహ జ్వాలలు
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఈ నెల 7న జై భారత్ క్షీరారామ ఆక్వారైతు సంఘం ఆధ్వర్యంలో ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాలకు చెందిన రైతులు సమావేశమయ్యారు. ఆక్వా రంగం కుదేలవుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పూలపల్లి వై జంక్షన్ వద్ద రోడ్డెక్కి నిరసన తెలిపారు. జూన్ నెలాఖరుకు పంట ముగించుకుని జూలై నుంచి సెప్టెంబరు వరకు పంట విరామం పాటించాలని సంఘ నాయకులు పిలుపునివ్వగా రైతులు మద్ధతు తెలిపారు. ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తం చేసే ప్రయత్నాల్లో రైతు సంఘాల నాయకులు నిమగ్నమయ్యారు. 100 కౌంట్ రొయ్య రూ.220 కొనుగోలు చేయాలని కూటమి ప్రభుత్వం ఎక్స్‌పోర్టర్స్‌కు సూచించడం కంటితుడుపు చర్యగా కొట్టిపారేస్తున్నారు. 100 కౌంట్ దిగుబడికి రూ.240 వరకు ఖర్చవుతుంటే దీని వల్ల నష్టమే తప్ప రైతులకు ప్రయోజనం ఏమీ లేదని చెబుతున్నారు. కిలోకు 50 కౌంట్ లోపు రొయ్యలు మాత్రమే అమెరికాకు వెళ్తుంటే మిగిలిన వాటి ధరలు తగ్గించడాన్ని ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
న్యూస్‌రీల్
క్రాప్ హాలిడేకు సిద్ధమవుతున్న రైతులు
ధరల పతనంపై తీవ్ర ఆగ్రహం
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి కార్యాచరణ
ఈ నేపథ్యంలో ఉండిలో ఆక్వా రైతుల సమావేశం రద్దు
సుంకాల పేరిట దోపిడీ
అమెరికా 26 శాతం పన్నులు విధించడాన్ని సాకుగా చూపించి ఎగుమతిదారులు రొయ్య రేట్లను అమాంతం తగ్గించేశారు. 100 కౌంట్ రూ.235 ఉండగా రూ. 30 నుంచి రూ.40 వరకు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఎకరానికి రైతులు టన్నుకు రూ. 40 వేల వరకు నష్టపోవాల్సి వస్తోంది. నెల రోజుల క్రితం వంద కౌంట్ రూ.260 ఉంటే రూ.230కు తగ్గించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతులు ఆందోళనలు నిర్వహించిన విషయం విధితమే. తాజా పరిణామాల నేపధ్యంలో ఆక్వా రైతులు ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమవుతున్నారు.
అప్సడా ఆధ్వర్యంలో బుధవారం ఉండిలోని కోట్ల ఫంక్షన్ హాలులో ఆక్వా రైతు సదస్సు జరగాల్సి ఉంది. అప్పడా వైస్ చైర్మన్ ఆనం వెంకటరమణరెడ్డి, ప్రభుత్వ పెద్దలు హాజరై ఆక్వా రైతుల సమస్యలపై చర్చిస్తారని రైతు సంఘాల నాయకులు తెలిపారు. అమెరికా సుంకాల నేపథ్యంలో రొయ్య ధరల స్థిరీకరణ, ముడిసరుకుల ధరలు తగ్గినా మేత ధరలు తగ్గకపోవడం, జోన్లకు సంబంధం లేకుండా సబ్సిడీ విద్యుత్, అధిక లోడు చార్జీల సమస్యల పరిష్కారం, క్రాప్ హాలిడే తదితర అంశాలపై చర్చిస్తారని, కీలకమైన ఈ సమావేశానికి అధిక సంఖ్యలో ఆక్వా రైతులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. అప్సడా, ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ పెద్దలు హాజరయ్యే ఈ సమావేశం వేదికగా ఆక్వా రంగాన్ని ఆదుకోవడంలో కూటమి వైఫల్యాలను ఎండగట్టాలని రైతు సంఘాల నాయకులు భావించారు. అయితే సమావేశం అర్ధాంతరంగా రద్దయ్యింది. అనివార్య కారణాలతో సదస్సు వాయిదా పడినట్లు జిల్లా మత్య్సశాఖ అధికారి ప్రకటించారు. ఇప్పటికే జిల్లాలోని మూడు నియోజకవర్గాల రైతులు క్రాప్ హాలీడేకు పిలుపునివ్వడం, ఉండి సమావేశంతో ఆ ప్రభావం మిగిలిన ప్రాంతాలపై పడుతుందన్న ఆందోళనతో సమావేశం రద్దుచేయించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆక్వా అతలాకుతలం

ఆక్వా అతలాకుతలం