కాకినాడ రూరల్ మండ లం పోలవరం మా ఊరు. మేము నలుగురం అ న్న దమ్ములం. తల్లిదండ్రు లు కూలి పనులకు వెళ్లేవారు. ట్రిపుల్ ఐటీలో ఉ చితంగా చదువుకునే అవకాశం రావడం వల్ల నే నొక్కడినే చదువుకున్నాను. కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. 2015 నుంచి కోరమాండల్ కంపెనీలో మేనేజర్‌గా చేస్తున్నా. కొత్త ఇల్లు కట్టుకోవడంతో పాటు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్నా.
–కర్రి కోటేశ్వరరావు
వైఎస్సార్‌కు రుణపడి ఉంటాం
ప్రకాశం జిల్లా కొత్తపట్న ం మండలం బీరంగుంట మా ఊరు. తల్లిదండ్రులు ఇద్దరూ కూలి పనులకు వెళ్తేనే ఇల్లు గడిచేది. కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి 2016 నుంచి కన్యాకుమారిలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో ఇంజనీర్‌గా చేస్తున్నా. తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నా. ట్రిపుల్‌ఐటీ లేకపోతే ఏ డిగ్రీనో చదివి ఉండేవాడిని. వైఎస్సార్‌కు రుణపడి ఉంటా.
–మద్దా సురేష్
ట్రిపుల్‌ఐటీతోనే ఈ స్థాయికి..