జేసీ రాహుల్‌కుమార్ రెడ్డి
భీమవరం: రైతుల నుంచి దాళ్వా ధాన్యం కొనుగోలుకు అధికారులు సిద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అధి కారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోళ్లపై సేకరణ కమిటీ సభ్యులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ధాన్యం కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాల్ రూ.2,300, గ్రేడ్–ఎ రకం రూ.2,320 ఉందన్నారు. తేమ శాతం 17 కంటే తక్కువ ఉండేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. బహిరంగ మార్కెట్‌లో మద్దతు ధర కంటే ఎక్కువ రేటు ఉంటే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకోవచ్చన్నారు. రైతు సేవా కేంద్రాల్లో తగినంత సిబ్బందిని నియమించి వారికి ధాన్యం కొనుగోలుపై పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. గోనె సంచులు, హమాలీలు, ధాన్యం రవాణాకు వాహనాలను అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ టి.శివరాం ప్రసాద్, డీఎస్‌ఓ ఎన్.సరోజ, జిల్లా సహకార శాఖ అధికారి ఎం.నాగరాజు, జిల్లా రవాణా శాఖ అధికారి బి.ఉమామహేశ్వరరావు, లీగల్ మెట్రా లజీ అసిస్టెంట్ కంట్రోలర్ వీవీ నాగరాజారావు తదితరులు పాల్గొన్నారు.