బుట్టాయగూడెం: జీలుగుమిల్లిలోని అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజుల క్రితం జీలుగుమిల్లి మండలం తాటాకులగూడేనికి చెందిన గంధం బోసు అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయగా ఖమ్మంలో చికిత్స పొందుతూ మృతిచెందిన విష యం తెలిసిందే. మృతదేహాన్ని గురువారం ఖమ్మం నుంచి బోసు స్వగ్రామానికి తీసుకువస్తుండగా తె లంగాణ, ఆంధ్ర సరిహద్దు వద్ద కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. బోసు మృతికి కారణాలు తేల్చాలంటూ భీష్మించారు. సీఐ బి.వెంకటేశ్వరరావు, ఎ స్సైలు నవీన్‌కుమార్, చంద్రశేఖర్ ఆందోళనకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులకు, కుటుంబ సభ్యులకు వాదోపవా దం జరిగింది. రాత్రి సమయానికి కూడా ఆందోళన కొనసాగడంతో సరిహద్దు వద్ద కిలోమీటరుకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు అక్కడికి చేరుకుని శుక్రవారం నాటికి నిందితులెవరో తేలుస్తామని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. బోసు మృతదేహాన్ని స్వగ్రామం తరలిస్తున్న సమయంలో కూడా పోలీసులు వెంటే ఉన్నారు. మృతదేహానికి శుక్రవారం అంత్యక్రియలు చేస్తామని బంధువులు తెలిపారు. ఇదిలా ఉండా బోసుపై దాడి కేసులో అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. దోషులను ప్రభుత్వం వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాల రాజు డిమాండ్ చేశారు.
గుర్తుతెలియని వ్యక్తి దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతి
మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తుండగా కుటుంబసభ్యుల ఆందోళన