ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): హిందూ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక వైఎంహెచ్‌ఏ హాలులో గుడిపాటి లలిత సంగీత నిర్వహణలో హేలాపురి సంగీత వైభవం పేరిట నిర్వహించిన కార్యక్రమం వీనుల విందు చేసింది. నగరానికి చెందిన పలువురు గాయకులు సంగీత కృతులు ఆలపించి ఆకట్టుకున్నారు. సంగీత కచేరీ నిర్వహించిన కళాకారులకు వయోలిన్ ద్వారా వీరా శివప్రసాద్, మృదంగం ద్వారా సీహెచ్ లక్ష్మీ నారాయణన్, తబ లా ద్వారా సీహెచ్ కల్యాణ్, ఫ్లూట్ ద్వారా కుమార్ బాబు, కీబోర్డ్ ద్వారా వెంకటేశ్వరరావు వాద్య సహకారం అందించారు. వైఎంహెచ్‌ఏ మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు యర్రా సోమలింగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కేవీ సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రాట్నాలమ్మా.. నమోనమః
పెదవేగి: రాట్నాలకుంటలో రాట్నాలమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో అ ర్చకులు విశేష పూజలు చేసి అమ్మవారిని ప్రత్యేకంగా అలకరించారు. ఆలయానికి పలు రూపాల్లో రూ.1,13,141 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్.సతీష్ కుమార్ తెలిపారు.