
ఆకాశవాణి జాతీయ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు
బుట్టాయగూడెం/జంగారెడ్డిగూడెం: విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో మహాత్మాజ్యోతిరావు పూలే జీవిత చరిత్రను కంజర కథగా ఆలపిస్తూ గురువారం రికార్డింగ్‌లో చేసినట్లు జంగారెడ్డిగూడేనికి చెందిన చిలుకూరి సుబ్బయ్యాచారి తెలిపారు. తనకు బుట్టాయగూడేనికి చెందిన ప్రముఖ డోలక్ కళాకారుడు పెనుగుర్తి సోంబాబు,, పాళ్లూరి ఏసురత్నం హార్మోనియం ద్వారా సహకారం అందించడంతో ఆల్ ఇండియా రేడియో బృందం రికార్డింగ్ చేశారని చెప్పారు. ఫూలే జీవితచరిత్ర ఆధారంగా సుబ్బయ్యాచారి చెప్పే కంజరకథ భారతదేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో ఒకే రోజు, ఒకే సమయానికి ప్రసారం జరగనుంది. ఈ కార్యక్రమం అనంతరం రేడియో స్టేషన్ డైరెక్టర్ చుండూరి శ్రీనివాస్, జయప్రకాష్‌లు తమ బృందాన్ని అభినందించి శాలువాలతో సత్కరించారని వివరించారు.