ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో సీఎంఆర్ జ్యూయలరీ షాపును సోమవారం సినీ నటి మీనాక్షి చౌదరి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎంఆర్ సంస్థ వ్యవస్థాపకుడు మావూరి వెంకటరమణ మాట్లాడుతూ తమ షోరూంలో వినియోగదారుల అభిరుచికి, శైలికి తగ్గట్టుగా ప్రాచీనత నుంచి ఆధునికత వరకు అన్ని రకాల ఆభరణాలు ఇక్కడ అందుబాటులో ఉంచామన్నారు. బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు 3 శాతం నుంచి ప్రారంభమౌతుందని, వెండి రెగ్యులర్ వస్తువులపై తరుగు మజూరీ లేదని తెలిపారు. షోరూమ్ ప్రారంభ కానుకగా గ్రాముకు రూ.300 వరకు తగ్గింపును ఈ నెల 30వ తేదీ వరకు ఇస్తున్నట్లు తెలిపారు. పారిశ్రామిక వేత్త అంబికా కృష్ణ మాట్లాడుతూ సీఎంఆర్ జ్యూయలరీ లాంటి పెద్ద సంస్థలు ఏలూరుకు రావడం వల్ల ఏలూరు ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. వ్యాపారవేత్త వాసవి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.