కై కలూరు: కొల్లేరు ఆపరేషన్‌లో భాగంగా చటాకాయిలో చెరువులకు గండ్లు కొట్టడానికి వెళ్లిన అటవీ సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకుని నిరసన తెలిపారు. గ్రామంలోని ప్రభుత్వ భూమిలో 40 ఎకరాలు, 16 ఎకరాలు వెరసి 56 ఎకరాల్లో రెండు చెరువులను ధ్వంసం చేయాల్సి ఉంది. బుధవారం 9 మంది అటవీ సిబ్బంది చెరువులకు గండ్లు కొట్టడానికి చటాకాయి వెళ్లగా గ్రామస్తులు టెంట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. మా చెరువుల జోలికి వస్తే ఊరుకునేది లేదని తెగేసి చెప్పారు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో కై కలూరు, మండవల్లి మండలాల్లో 7,500 ఎకరాలు అదనంగా ధ్వంసం చేశారని వాటిని ముందుగా పంపిణీ చేయాలని మెలిక పెట్టారు. దీంతో అటవీశాఖ అధికారులు చేసేది ఏమీలేక వెనక్కి మళ్లారు.