
ప్రతిభ చూపిన యోగ క్రీడాకారులు
తాడేపల్లిగూడెం (టీఓసీ): యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాజస్థాలోని పాలిలో ఇటీవల జరిగిన 47వ జాతీయ స్థాయి సీనియర్ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో రాష్ట్ర యోగ క్రీడాకారులు ప్రతిభ చాటారు. రాష్ట్రానికి ఏడు పతకాలు వచ్చాయని యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెరకువాడ నరసింహరాజు, అవినాష్ శెట్టి తెలిపారు. లలనా ప్రియ (కర్నూలు), టి.శిరీషా (పశ్చిమగోదావరి), సత్యప్రసాద్ రాజు, రామారావు (విజయవాడ), నవీన్, యామిని (విశాఖ), కావ్యశ్రీ (నెల్లూరు) పతకాలు సాధించారన్నారు. వీరిని యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు సీహెచ్‌ఏఆర్‌కే వర్మ, కోశాధికారి మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు సిల్వం, వేణుగోపాల్, సంయుక్త కార్యదర్శులు చంద్రశేఖర్, సుధాకర్, రామారావు, వెంకటేష్ అభినందించారు.
రకీడలతో ఆరోగ్యం
తాడేపల్లిగూడెం: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటే ఆరోగ్యం సిద్ధిస్తుందని శశి ఇంజనీరింగ్ కళాశాల వార్షిక క్రీడా దినోత్సవంలో వైస్‌చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ అన్నారు. బుధవారం జరిగిన ఈ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ మానసిక ఒత్తిడిని జయించడానికి క్రీడలు దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్రస్థాయిలో రాణించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. డీన్ స్టూడెంట్ అఫైర్సు టి.సుబ్రహ్మణ్యం, కో–ఆర్డినేటర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
హుండీ ఆదాయం లెక్కింపు
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. 57 రోజులకు రూ.17,97,055 ఆదా యం లభించిందని ఆలయ ఈఓ కేవీ గోపాలరావు తెలిపారు. దేవదాయశాఖ తనిఖీ అధికారి సుధాకర్ పర్యవేక్షించారు.

మాట్లాడుతున్న వైస్‌చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ