
పెంటపాడులో ఆసరా చెక్కు అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
పెంటపాడు: మహిళాభ్యున్నతి సీఎం జగన్‌తోనే సాధ్యమని ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. స్థానిక పోస్టు బేసిక్ స్కూల్ ఆవరణలో బుధవారం డ్వాక్రా మహిళలకు ఆసరా చెక్కు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా రుణమాఫీని నాలుగు విడతల్లో అందిస్తానని చెప్పి ఇప్పటికే మూడు విడతలు అందించారన్నారు. అయితే 14 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు మహిళలకు చేసింది శూన్యమని, మరలా ప్రజలను మాటలతో వంచించేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మేనిఫెస్టోను మత గ్రంథంగా భావిస్తూ హామీలన్నింటినీ అమలు చేస్తోందన్నారు. జనసేన నాయకుడు పవన్‌కల్యాణ్‌ను ప్రజలు ఎప్పటికీ నమ్మరన్నారు. సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగించేందుకు వచ్చే ఎన్నికల్లోనూ సీఎం జగన్‌ను ఆదరించాలని ప్రజలను కోరారు. పెంటపాడు మండలంలోని 13,490 మంది మహిళలకు ఆసరా మూడో విడత కింద రూ.12,95,74,729 చెక్కు అందించారు. ఎంపీపీ దాసరి హైమావతి, జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పులూరి వరలక్ష్మి, జిల్లా, మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు కై గాల శ్రీను, కట్టుబోయిన కృష్ణప్రసాద్, సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ, సొసైటీల అధ్యక్షులు గుండుమోగుల సాంబయ్య, బూరాడ శ్రీను, దేవ వెంకటరమణ, ఏఎంసీ వైస్ చైర్మన్ జామి కృష్ణ, వైఎస్సార్ సేవాదళ్ అధ్యక్షుడు సంపతరావు కృష్ణారావు, పార్టీ నాయకులు నల్లమిల్లి విజయానందరెడ్డి, పసల చంటి, మైలవరపు పెదబాబు తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటా : సీఎం జగన్ మంత్రివర్గంలో మంత్రినైనా, ఉప ముఖ్యమంత్రి అయినా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే గానే గుర్తింపు తనకెంతో ఇష్టమని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనను ఉన్నత స్థానంలో నిలబెట్టిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. 1994లో రాజకీయాల్లోకి వచ్చి 2004లో వైఎస్సార్ హయాంలో ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందున్నానన్నా రు. ప్రజల ఆశీర్వాదంతోనే నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తున్నానని మంత్రి కొట్టు అన్నారు.