
నరసాపురంలో ఆసరా కార్యక్రమంలో మాట్లాడుతున్న చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు
ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు
చింతలపూడి/బుట్టాయగూడెం: జగదభిరాముడి కల్యాణోత్సవాలకు ఆలయాలు ముస్తాబయ్యాయి.. శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం యర్రగుంటపల్లి సమీపంలోని (రామునిగట్టుగా ప్రసిద్ధి చెందిన) రామలింగేశ్వరస్వామి ఆలయం, కామవరపుకోట మండలంలోని చినభద్రాద్రిగా పేర్గాంచిన సీతారామస్వామి దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏటా వేలాది మంది ఆయా ఆలయాలను రామనవమి ఉత్సవాల సందర్భంగా సందర్శిస్తారు.
శంఖు చక్రాలతో..
రామునిగట్టు ఆలయంలోని విగ్రహాలు భద్రాద్రిలో విగ్రహాలు మాదిరిగా ఉండటం విశేషం. ఆలయానికి చారిత్రక నేపథ్యం ఉంది. దండకారుణ్యం దక్షిణ భాగాన కొండపై ఉత్తరాభి ముఖంగా స్వామివారు శంఖు, చక్రాలతో వెలిశారని పెద్దలు చెబుతుంటారు. ఇక్కడ స్వామి కల్యాణం జరిపిస్తే వివాహం, సంతాన భాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి చేరువలో పరమేశ్వరుడు నందీ సమేతంగా కొండ పైభాగంలో వేంచేసి ఉన్నాడు. పరమశివుడిని శ్రీరాముడు ముళ్ల గోరింట, బొంత పూలతో పూజించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఏటా చైత్రశుద్ధ నవమి రోజు ఇక్కడ స్వామి కల్యాణ్యాన్ని జరిపిస్తారు. ఆలయ కమిటీ, గ్రామస్తులు దాతల సహకారంతో రూ.25 లక్షలతో నూతన ఆలయాన్ని పునరుద్ధరించారు.
శ్రీవారి దత్తత ఆలయం
తూర్పు యడవల్లిలోని సీతారామస్వామి దేవస్థానం ద్వారకాతిరుమల చినవెంకన్న దత్తత ఆలయం. ఆలయం చినభద్రాద్రిగా పేర్గాంచింది. 2003 జూన్‌లో ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవాలు జరిగాయి. ఆలయంలో ఆహ్లాదకర వాతావరణం, నిర్మాణ శైలి, బంగారు తాపడంతో ధ్వంజస్తంభం, ఆవరణలోని రాముని విగ్రహాలు, మూలవిరాట్‌కు సమీప భాగాన కుడివైపున స్వామి కల్యాణ మండపం ఆకట్టుకుంటాయి. ఏటా శ్రీరామనవమి నాడు వేకువజామున ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు జరుగుతాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఇక్కడ కూడా భద్రాచలంలో మాదిరిగా స్వామి, అమ్మవార్ల విగ్రహాలు ఉండటం విశేషం. శ్రీరామనవమికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నరసాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా పక్షపాతి అని ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పట్టణంలోని అల్లూరి సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రంలో బుధవారం నరసాపురం మున్సిపాలిటీలో 1 నుంచి 15 వరకు వార్డుల సంబంధించి వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముదునూరి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకు పెద్దపీట వేశారన్నారు. మహిళాభ్యుదయమే లక్ష్యంగా పథకాలు రూపొందించారన్నారు. ఆసరా, చేయూత, సున్నావడ్డీ రుణాలు వంటి పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అండగా నిలిచిందన్నారు. మహిళా సాధికారత, స్వావలంబన దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారన్నారు. గతం కంటే మెరుగైన విధానాలను తీసుకువచ్చి రాష్ట్రంలోని పొదుపు సంఘాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. పట్టణంలోని 634 డ్వాక్రా గ్రూపులకు ఆసరా మూడో విడతలో రూ.5.61 కోట్లు జమ చేశామన్నారు. మొత్తంగా మూడు విడతల్లో రూ.16.82 కోట్లు అందజేశామన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ, వైస్ చైర్‌పర్సన్ కామన నాగిని, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్‌పర్సన్ బర్రి లీల, వైఎస్సార్‌సీపీ పట్టణ, యూత్, మహిళా అధ్యక్షులు బూసరపు జయ, చదలవాడ మెర్లిన్, కాగిత సత్యవాణి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
యర్రగుంటపల్లి రామునిగట్టుపై విగ్రహాలు
తూర్పు యడవల్లిలోని ఆలయ ప్రాంగణంలో..
కేంద్రీయ విద్యాలయలో ప్రవేశాలు
దెందులూరు: గోపన్నపాలెంలోని కేంద్రీయ విద్యాలయలో 2023–24 సంవత్సరానికి 1వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ ఎస్.నాగేంద్రకుమార్ తెలిపారు. వచ్చేనెల 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల 31 నాటికి ఆరేళ్లు నిండి ఎనిమిదేళ్లలోపు ఉన్న పిల్లలు అర్హులన్నారు. 2 నుంచి 7వ తరగతి వరకు ప్రవేశం కోరేవారు వచ్చేనెల 3 నుంచి 12 వరకు విద్యాలయ వెబ్‌సైట్‌లో వివరాలు పొందవచ్చన్నారు.
రామునిగట్టును అభివృద్ధి చేయాలి
యర్రగుంటపల్లి (రామునిగట్టు) ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలి. ప్రభుత్వం కూడా ఆలయాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి. ఆలయానికి చెందిన భూములను అప్పగించి ప్రభుత్వం రక్షణ కల్పించాలి. ఆలయం వద్దకు రోడ్డు సౌకర్యం కల్పిస్తే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది.
– వి.సత్యనారాయణ శాస్త్రి, ఆలయ కమిటీ చైర్మన్, యర్రగుంటపల్లి
లక్ష్మీపురంలో వినూత్నంగా..
బుట్టాయగూడెం మండలం లక్ష్మీపురంలో శ్రీరామనవమి వేడుకలను వినూత్న ఆచారంలో నిర్వహిస్తాం. అడవిలో నాలుగు రకాల చెట్ల మానులను తీసుకువచ్చి విగ్రహాలుగా మలిచి ఏటా పూజలు చేయడం మా ఆనవాయితీ. అదే మాకు జయం, మా గ్రామానికి రక్ష. ఈ సంప్రదాయాన్నే మేం కొనసాగిస్తున్నాం.
– కపిలవాయి హరిసూర్యనారాయణ, ఉత్సవ కమిటీ సభ్యుడు, లక్ష్మీపురం

