
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో కొత్తగా ఏడు ఇసుక రీచ్‌లను ఆమోదించినట్టు ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ ఎం.సూర్యతేజ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక రీచ్‌ల ఆమోదానికి సంబంధిత శాఖల అనుమతులను జిల్లాస్థాయి కమిటీలో పరిశీలించిన అనంతరం ఏడు రీచ్‌లకు అనుమతులు ఇచ్చామన్నారు. పెనుగొండ మండలం సిద్ధాంతం వన్ అండ్ టు, నడిపూడి వన్ అండ్ టులలో నాలుగు ఓపెన్ రీచ్‌లు, యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెం, యలమంచిలి, నరసాపురం మండలం మాధవాయపాలెంలో మూడు డీసిల్టేషన్ పాయింట్లలో ఇసుక సేకరణకు ఆమోదించామన్నారు. సెబ్ ఏఎస్పీ ఏటీవీ రవికుమార్, గనులశాఖ డీడీ బి.రవికుమార్, జిల్లా నీటి వనరుల అధికారి నాగార్జున, డీపీఓ ఎన్.నాగలత, జిల్లా రవాణా అధికారి మహేశ్వరరావు, జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి వీరాస్వామి పాల్గొన్నారు.

సమీక్షిస్తున్న జాయింట్ కలెక్టర్ సూర్యతేజ