ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ థియరీ పబ్లిక్ పరీక్షలు బుధవారం నాటితో ప్రశాంతంగా ముగిశాయని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.చంద్రశేఖరబాబు తెలిపారు. బ్రిడ్జి కోర్సు పరీక్షలు ఏప్రిల్ నాలుగో తేదీ వరకు జరుగుతాయని ఆయన అన్నారు. బుధవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన కెమిస్ట్రీ–2, కామర్స్–2 పరీక్షలకు మొత్తం 106 కేంద్రాల్లో 32,824 మంది విద్యార్థులకు 31,689 మంది హాజరయ్యారు. విద్యార్థుల హాజరు 97 శాతంగా నమోదయింది. ఏలూరు జిల్లాలో 39 కేంద్రాల్లో 11,055 మంది జనరల్ విద్యార్థులకు 10,707 మంది హాజరుకాగా 348 మంది గైర్హాజరయ్యారు. 859 మంది ఒకేషనల్ విద్యార్థులకు 714 మంది హాజరుకాగా 145 మంది గైర్హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 52 కేంద్రాల్లో 15,560 మంది జనరల్ విద్యార్థులకు 15,164 మంది హాజరుకాగా 396 మంది గైర్హాజరయ్యారు. 754 మంది ఒకేషనల్ విద్యార్థులకు 668 మంది హాజరు కాగా 86 మంది గైర్హాజరయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలో 15 కేంద్రాల్లో 4,264 మంది జనరల్ విద్యార్థులకు 4,182 మంది హాజరుకాగా 82 మంది గైర్హాజరయ్యారు. 332 ఒకేషనల్ విద్యార్థులకు 254 మంది హాజరుకాగా 78 మంది గైర్హాజరయ్యారు.
ఆఖరి పరీక్షలకు 31,689 మంది హాజరు
ఏప్రిల్ 4 వరకు బ్రిడ్జి కోర్సు పరీక్షలు