విగ్రహ ధ్వంసం కేసులో ముగ్గురి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

విగ్రహ ధ్వంసం కేసులో ముగ్గురి అరెస్టు

Mar 29 2023 11:54 PM | Updated on Mar 29 2023 11:54 PM

నిందితుల వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ రవిప్రకాష్‌  - Sakshi

నిందితుల వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ రవిప్రకాష్‌

తణుకు: తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం కేసులో ముగ్గురు నిందితులను తణుకు రూరల్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరిలో అదే గ్రామానికి చెందిన గుమ్మిడి మోహన్‌తోపాలు ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఈ మేరకు తణుకు రూరల్‌ పోలీసు స్టేషన్‌లో జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్‌ వివరాలను విలేకర్లకు వెల్లడించారు. గ్రామంలోని మండల పరిషత్‌ పాఠశాల ఆవరణలో అంబేడ్కర్‌ విగ్రహం తలభాగం తొలగింపుపై పోలీసులు కేసు నమోదు చేసి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. గుమ్మిడి మోహన్‌తోపాటు మరో ఇద్దరు మైనర్లు ఈనెల 27న మద్యం తాగి అంబేడ్కర్‌ విగ్రహం తలభాగాన్ని మాయం చేశారు. విగ్రహం తల భాగం సమీపంలోని చెరువులో పోలీసులు గుర్తించారు. విగ్రహ ఏర్పాటు సమయంలో సైతం వీరు విబేధించినట్టు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు గతేడాది సెప్టెంబరులో గ్రామంలో అంబేడ్కర్‌, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని పవన్‌ కల్యాణ్‌ ఫొటోను అంబేడ్కర్‌ ఫొటోతోపాటు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొందరు వ్యక్తు లు చించివేశారు. దీనిపై గ్రామానికి చెందిన 15 మందిని అనుమానించి పెద్దల సమక్షంలో మందలించి వదిలేశారు. వారిలో ప్రస్తుతం అరెస్టయిన నిందితు లు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లను జువైనల్‌ కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌ విధించారు. కేసులో సహకరించిన నరసాపురం డీఎస్పీ కె.మనోహరాచారి, తణుకు రూరల్‌ సీఐ సీహెచ్‌ ఆంజేయులు, రూరల్‌ ఎస్సై కె.గుర్రయ్యలను ఎస్పీ రవిప్రకాష్‌ అభినందించారు.

అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుకు హామీ

తణుకు టౌన్‌: ముద్దాపురం గ్రామ ప్రధాన సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహాన్ని కమిషన్‌ తరపున ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యుడు చెల్లెం ఆనంద్‌ప్రకాష్‌ హామీ ఇచ్చారు. బుధవారం ముద్దాపురం హైస్కూల్‌లో దుండగులు ధ్వంసం చేసిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. అక్కడ ఆందోళన చేస్తోన్న దళిత సంఘాల నాయకులతో మాట్లాడారు. నిందితులను అరెస్ట్‌ చేశారని, దీనిపై పూర్తి స్థాయి విచారణ చేయాలని ఆయన అధికారులను కోరారు. గ్రామంలో శాంతి కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. దళిత సంఘాల నాయకులతో కలిసి గాంధీ బొమ్మ సెంటర్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో శాంతిభద్రతలను డీఎస్పీ రవి మనోహరాచారి ఆధ్వర్యంలో సీఐలు సీహెచ్‌ ఆంజనేయు లు, ముత్యాల సత్యనారాయణ, ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. ఎంపీపీ రుద్ర ధనరాజు, జెడ్పీటీసీ సభ్యురాలు ముళ్లపూడి అన్నపూర్ణాదేవి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పోలేపల్లి వెంకట ప్రసాద్‌, సర్పంచ్‌ మజ్జి పద్మ, గ్రామ కమిటీ అధ్యక్షుడు తుమ్మగంటి సత్యనారాయణ, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఉండవల్లి జానకి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ అధ్యక్షుడు పొట్ల సురేష్‌, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు జంగం ఆనంద్‌కుమార్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు ముళ్లపూడి బాబూరావు, అంబేడ్కర్‌ యువజన, జైభీమ్‌ యువజన సంఘా లు, మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు.

వీరిలో ఇద్దరు మైనర్లు

రిమాండ్‌కు తరలింపు

జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌

శంకుస్థాపన చేస్తున్న ఎస్సీ కమిషన్‌ సభ్యుడు ఆనంద్‌ప్రకాష్‌ 1
1/1

శంకుస్థాపన చేస్తున్న ఎస్సీ కమిషన్‌ సభ్యుడు ఆనంద్‌ప్రకాష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement