
యువకులకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందించి సత్కరిస్తున్న ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): యువత లక్ష్య సాధనలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి పిలుపునిచ్చారు. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువకేంద్రం ఏలూరు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నైబర్‌హుడ్ యూత్ పార్లమెంటు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలతో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. యువజన అభివృద్ధికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. మరో అతిథి ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మాట్లాడుతూ దేశ సమైక్యతకు యువత పాటుపడాలన్నారు. నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి దూలం కిషోర్ మాట్లాడుతూ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని బుధవారం నరసాపురం స్వర్ణాంధ్ర కళాశాలలో నిర్వహించనున్నామన్నారు. ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జి.గిరిబాబు మాట్లాడుతూ చిరుధాన్యాల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయన్నారు. విద్యార్థులు జీ20 దేశాల అధినేతల మాస్కులు ధరించి జీ20 సమ్మిట్ నమూనా సదస్సును ప్రదర్శించారు. అనంతరం యువతకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. సెట్‌వెల్ సీఈఓ ఎండీహెచ్ మెహర్‌రాజ్, జిల్లా ఉపా ధి అధికారి మధుభూషన్‌రావు, సీఆర్ రెడ్డి కళాశాల కరస్పాండెంట్ జాస్తి మల్లికార్జునరావు, ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.