
మొగల్తూరులో ఆసరా వారోత్సవ సభలో మాట్లాడుతున్న ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు
నరసాపురం రూరల్: మహిళలకు వరంగా వైఎస్ ఆర్ ఆసరా పథకం నిలుస్తుందని ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. మంగళవారం మొగల్తూరులో జరిగిన ఆసరా వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొగల్తూరు, రామన్నపాలెం, శేరేపాలెం, కొత్తపాలెం గ్రామాల్లోని 580 గ్రూపులకు సంబంధించి రూ.6.74 కోట్ల ఆసరా చెక్కును అందించారు. ఈసందర్భంగా చీఫ్‌విప్ ముదునూరి మాట్లాడుతూ సీఎం జగన్ హమీ మేరకు ఇప్పటివరకూ మూడు విడతల్లో 75 శాతం డ్వాక్రా రుణమాఫీ చేశారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆసరా, చేయూత, సున్నావడ్డీ పథకాల ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు కృషి చేస్తోందన్నారు. దేశానికే పొదుపు సంఘాల మహిళలు ఆదర్శంగా నిలిచేలా సీఎం జగన్ సంకల్పి ంచారన్నారు. గత ప్రభుత్వం కంటే మిన్నగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వీఓఏలకు నెలకు రూ.8 వేల వేతనం అందిస్తున్నామన్నారు. తొలుత సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. అనంతరం ఇటీవల ఎమ్మెల్సీగా గెలుపొంది న వంకా రవీంద్రనాథ్‌కు శాలువ కప్పి సన్మానం చేశారు. ఎంపీపీ అందే సూర్యావతి, జెడ్పీటీసీ తిరుమాని బాపూజీ, వైస్ ఎంపీపీ కై లా సుబ్బారావు, సర్పంచ్‌లు పడవల మేరీ, తణుకుల మునేశ్వరరావు, లోకం నాని, బందెల ఏలీషా, ఎంపీటీసీ స భ్యులు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పాలా జ్యోతి, నాయకులు కర్రి ఏసుబాబు, గుబ్బల నారా యణమూర్తి, పాలా రాంబాబు, ఎంపీడీఓ ఆర్‌సీ ఆనంద్‌కుమార్, ఏపీఎం సుభాషిణి పాల్గొన్నారు.