దెందులూరు: పోటీతత్వంతోనే విజయం సాధించాలనే పట్టుదల కలుగుతుందని జేఎన్‌టీయూ (కాకినాడ) రెక్టర్ కేవీ రమణ అన్నారు. వేగవరం హేలాపురి ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో జరుగుతున్న సౌత్‌జోన్ పోటీలను తిలకించేందుకు మంగళవారం వచ్చారు. గుడ్లవల్లేరు కళాశాల జట్టుపై ఏలూరు కళాశాల జట్టు, విష్ణు కళాశాల జట్టుపై పీవీపీ సిద్ధార్థ కళాశాల జట్టు, సారథి కళాశాల జట్టుపై వాసవి ఇంజనీరింగ్ కళాశాల జట్టు, సెయింట్ మేరీస్ కళాశాల జట్టుపై సీఆర్‌ఆర్ కళాశాల జట్టు విజయం సాధించాయి. కళాశాల ప్రిన్సిపాల్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.