టి.నరసాపురం: పంట ధ్వంసంపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై కె.సతీష్‌కుమార్ తెలిపారు. పెదవేగి మండలం మొండూరుకు చెందిన బలుసు శ్రీనివాసచౌదరికి టి.నరసాపురం మండలం గుడ్లపల్లిలో తొమ్మిది ఎకరాల పొలం ఉందన్నా రు. ఇందులోని ఎనిమిది 8 ఎకరాల్లో పామాయిల్ తోట, ఒక ఎకరంలో మొక్కజొన్న వేశారని తెలిపారు. ఈ నెల 20న దెందులూరుకు చెందిన కొడాలి శ్రీకృష్ణ వరప్రసాద్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి తన పొలంలోకి ప్రవేశించి, ట్రాక్టర్‌తో మొక్కజొన్న పంటను దున్ని రూ.లక్ష మేర నష్టాన్ని కలిగించాడని శ్రీనివాస చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.